‘ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసు’

Indias UN Envoy Don't Patronize Us We Know What To Do - Sakshi

Don’t patronize us: ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి విషయంలో యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీలో పెట్టిన పలు తీర్మానాల పై ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది. అయితే ఉక్రెయిన్‌- రష్యా విషయంలో భారత్‌ అనుసరిస్తున్న తటస్థ వైఖరిని విమర్శిస్తూ యూకేలోని నెదర్లాండ్‌ రాయబారి తాజాగా కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు నెదర్లాండ్‌ రాయబారి కరెల్ వాన్ ఊస్టెరోమ్ ట్విట్టర్‌లో.." ఐక్కరాజ్యసమితలో ప్రవేశపెడుతున్న తీర్మానాల ఓటింగ్‌కి భారత్‌ దూరంగా ఉండకూడదు. యూఎన్‌ నిబంధనలను గౌరవించాలి" అని ట్వీట్‌ చేశారు.ఈ వ్యాఖ్యాలకు ఐక్యరాజ్య సమితిలోని భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి ఘాటుగా స్పందించారు. ...ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసు. దయచేసి మీరు సలహాలు ఇ‍వ్వకండి అని గట్టి కౌంటరిచ్చారు.

ఈ మేరకు రష్యా ఉక్రెయిన్‌ సమస్యపై  బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సమావేశంలో ఈ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ... ఉక్రెయిన్‌ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసునని ధీటుగా సమాధానమిచ్చారు.  ఉక్రెయిన్‌ పై రష్యా సాగిస్తున్న దాడిని నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానాల ఓటింగ్‌కి భారత్‌ దూరంగానే ఉంది.

అంతేకాదు యూఎన్‌ మానవహక్కుల నుంచి రష్యాను నిషేధించేలా చేసిన తీర్మానంపై ఓటింగ్‌కి, ఉక్రెయిన్‌లోని మానవతా సంక్షోభంపై చేసిన తీర్మానం పై ఓటింగ్‌కి కూడా భారత్‌ దూరంగా ఉంటూ వస్తూ ఉంది. అదీగాక భారత్‌ ఇప్పటి వరకు ఈ తీర్మానాలన్నింటికీ దూరంగా ఉంటూ తటస్థ వైఖరిని అవలంభించడంతో ప్రపంచ దేశాల నుంచి సర్వత్ర విమర్శలు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలోనే యూఎన్‌లోని భారత రాయబారి తిరుమూర్తి గట్టి కౌంటరిచ్చారు. భారత్‌కు ఎవ్వరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, తామేం చేస్తున్నామో తమకు పూర్తి అవగాహన ఉందని తిరుమూర్తి స్పష్టం చేశారు.

(చదవండి: యావత్‌ ప్రజల ప్రయోజనం కోసం ఉక్రెయిన్‌ యుద్ధం ముగిసిపోవాలి!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top