breaking news
Patronized
-
‘ఉక్రెయిన్ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసు’
Don’t patronize us: ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ దాడి విషయంలో యూఎన్ జనరల్ అసెంబ్లీలో పెట్టిన పలు తీర్మానాల పై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అయితే ఉక్రెయిన్- రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న తటస్థ వైఖరిని విమర్శిస్తూ యూకేలోని నెదర్లాండ్ రాయబారి తాజాగా కొన్నికీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నెదర్లాండ్ రాయబారి కరెల్ వాన్ ఊస్టెరోమ్ ట్విట్టర్లో.." ఐక్కరాజ్యసమితలో ప్రవేశపెడుతున్న తీర్మానాల ఓటింగ్‌కి భారత్ దూరంగా ఉండకూడదు. యూఎన్ నిబంధనలను గౌరవించాలి" అని ట్వీట్ చేశారు.ఈ వ్యాఖ్యాలకు ఐక్యరాజ్య సమితిలోని భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఘాటుగా స్పందించారు. ...ఉక్రెయిన్ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసు. దయచేసి మీరు సలహాలు ఇవ్వకండి అని గట్టి కౌంటరిచ్చారు. ఈ మేరకు రష్యా ఉక్రెయిన్ సమస్యపై బుధవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో సమావేశంలో ఈ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ... ఉక్రెయిన్ విషయంలో భారత్‌కు ఏం చేయాలో తెలుసునని ధీటుగా సమాధానమిచ్చారు. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దాడిని నిరసిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ప్రవేశ పెట్టిన తీర్మానాల ఓటింగ్‌కి భారత్ దూరంగానే ఉంది. అంతేకాదు యూఎన్ మానవహక్కుల నుంచి రష్యాను నిషేధించేలా చేసిన తీర్మానంపై ఓటింగ్‌కి, ఉక్రెయిన్‌లోని మానవతా సంక్షోభంపై చేసిన తీర్మానం పై ఓటింగ్‌కి కూడా భారత్ దూరంగా ఉంటూ వస్తూ ఉంది. అదీగాక భారత్ ఇప్పటి వరకు ఈ తీర్మానాలన్నింటికీ దూరంగా ఉంటూ తటస్థ వైఖరిని అవలంభించడంతో ప్రపంచ దేశాల నుంచి సర్వత్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే యూఎన్‌లోని భారత రాయబారి తిరుమూర్తి గట్టి కౌంటరిచ్చారు. భారత్‌కు ఎవ్వరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, తామేం చేస్తున్నామో తమకు పూర్తి అవగాహన ఉందని తిరుమూర్తి స్పష్టం చేశారు. (చదవండి: యావత్ ప్రజల ప్రయోజనం కోసం ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోవాలి!) -
‘సాక్షి మైత్రీ మహిళ’కు విశేష ఆదరణ
తిరుపతి కల్చరల్: సాక్షి దినపత్రిక, టీవీ, పిడిలైట్, ఉషా కంపెనీల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తిరుపతి నగరంలో నిర్వహించిన సాక్షి మైత్రీ మహిళ కార్యక్రమానికి విశేష ఆదరణ లభించింది. కార్యక్రమంలో భాగంగా బైరాగిపట్టెడలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జ్యువలరీ అండ్ ఫ్యాషన్ డిజైన్ సంస్థ కార్యాలయంలో గృహిణులకు స్వయం ఉపాధికై చేతి వృత్తులపై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగరంలోని సుమారు 80 మంది మహిళలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాక్షి మైత్రీమహిళ రాయలసీమ ప్రోగ్రామ్ ఇన్చార్జి జే.ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి తద్వారా వారు ఆర్థికంగా ఎదిగి తమవంతు కుటుంబానికి ఆదరణగా నిలపాలనే సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తం గా సాక్షి మైత్రీ మహిళ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. జిల్లాలో చిత్తూరులో కూడా నిర్వహించామని, తిరుపతి నగరంలో ఐదు రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని ఆయన పేర్కొన్నా రు. ఐదు రోజుల పాటు మహిళలకు ఉచితంగా హస్తకళల తయారీ, టైలరింగ్, పెయింటింగ్ వంటి చేతివృత్తులకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. శిక్షణలో పాల్గొనే మహిళలకు ఎలాంటి విద్యాప్రామాణికం లేదన్నారు. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు అంద జేయడంతో పాటు సాక్షి మైత్రీ మహిళలో సభ్యత్వం కార్డులు పంపిణీ చేస్తామన్నారు. ఆసక్తి గల మహిళలు 9505555020, 9640131153ను సంప్రదించాలని ఆయన కోరారు. అనంతరం ఎన్ఎఫ్ఐ సంస్థ డెరైక్టర్ మాదిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో సాక్షి మైత్రీ మహిళ ద్వారా ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం పడిలైట్, ఉషా కంపెనీ ప్రతినిధు లు మహిళలకు హస్తకళలు, టైలరింగ్ వృత్తులపై శిక్షణ కల్పించారు. చిత్తూరులో రెండోరోజూ ‘సాక్షి’ మైత్రీమహిళ చిత్తూరు(సిటీ) : పిడిలైట్ సంస్థ, సాక్షి దినపత్రిక-టీవీ సంయుక్త ఆధ్వర్యంలో గృహిణుల కోసం నిర్వహిస్తున్న సాక్షి మైత్రీమహిళ కార్యక్రమం రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. స్థానిక పీసీఆర్ ప్రభుత్వ వృత్తివిద్యా కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని పలువురు మహిళలు హాజరై పెయింటింగ్, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, ఇతర హేండీక్రాఫ్ట్స్పై శిక్షణ తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రో గ్రామ్ కో-ఆర్డినేటర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ గృిహ ణులకు స్వయం ఉపాధి కల్పించేందుకు వీలుగా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పా రు. మరో మూడు రోజుల పాటు చిత్తూరు నగరంలో శిక్షణ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పిడిలైట్ సంస్థకు చెందిన ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు.