జీ20 పాలన పగ్గాలు చేపట్టనున్న భారత్‌...బ్లింకన్‌తో జై శంకర్‌ భేటీ

India Set Preside Over G 20 Presidency Jaishankar Blinken Meet - Sakshi

డిసెంబర్‌1 న జరగనున్న జీ20 శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహించనుంది. భారత్‌ ప్రెసిడెన్సీకి యూఎస్‌ మద్దుతిస్తోంది కూడా. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం ప్రారంభంలో జీ20 లోగో, థీమ్‌ని ఆవిష్కరించారు. ఈ ఏషియన్‌ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా యూఎస్‌ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ కాంబోడియాలో సమావేశమై కీలకాంశాలు చర్చించారు.

అంతేగాదు ఈ సదస్సులో చర్చించాల్సిన విషయాలను కూడా పంచుకున్నారు. ఈ సమావేశంలో ఉక్రెయిన్‌ యుద్ధం, యూఎస్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌తో సమావేశం, ఉక్రెయిన్‌-ఇండో పసిఫిక్‌, ఇంధనం, జీ20 ద్వైపాక్షిక సంబంధాలు తదితరాలపై చర్చించనున్నారని జైశంకర్‌ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు.

ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్‌ కూడా ట్విట్టర్‌లో...భారత జీ20 ప్రెసిడెన్సీకి అమెరికా మద్దతిస్తోంది. జీ20 లోగో సార్వత్రిక సోదరభావాన్ని ప్రతిబింబిస్తోంది. జీ20 లోగో కమలం కష్ట సమయాల్లో ఆశకు చిహ్నం. G20 ప్రెసిడెన్సీ భారతదేశానికి కేవలం దౌత్యపరమైన సమావేశం కాదు, ఇది ఒక కొత్త బాధ్యత తోపాటు భారతదేశంపై ప్రపంచ విశ్వాసానికి కొలమానం అని బ్లింకెన్‌ అన్నారు.

(చదవండి: పుతిన్‌ ఓడిపోతాడు...చైనా బలపడుతుంది: బ్రిటన్‌ ప్రధాని షాకింగ్‌ వ్యాఖ్యలు)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top