కరోనా కట్టడి: భారత్‌పై ఐఎంఎఫ్‌ ప్రశంసలు

IMF Chief Praises India Over Dealing With Coronavirus - Sakshi

కరోనా కట్టడి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో భారత్‌ చర్యలు భేష్‌

సాగు చట్టాలు వ్యవసాయ సంస్కరణల్లో ముందడుగు

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ కట్టడితో పాటు దానివల్ల కుంటుపడిన ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడం కోసం భారత్‌ నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఫ్‌) ప్రశంసించింది. అంతేకాకుండా ఆర్థికవ్యవస్థలో సానుకూల మార్పులకు దోహదం చేసే చర్యలను ఈ సంవత్సరం కూడా కొనసాగించాలని సూచించింది. అంతర్జాతీయ మీడియా రౌండ్‌టేబుల్‌ సమావేశం సందర్భంగా ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జీవా మాట్లాడుతూ.. ‘కరోనా కాలంలో తీసుకున్న చర్యల ఫలితంగా ఈ సంవత్సరం భారత్‌లో ప్రతికూల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని మా అభిప్రాయం. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అప్‌డేట్‌ ఆవిష్కరణలో ఇదే విషయాన్ని ప్రముఖంగా వెల్లడించబోతున్నాం. వరల్డ్‌ ఎకనమిక్‌ అప్‌డేట్‌ను ఈ నెల 26న విడుదల చేస్తాం. దీన్ని ప్రతి ఒక్కరు శ్రద్దగా గమనించాలి’ అంటూ అన్ని దేశాలకు పిలుపునిచ్చారు. (చదవండి: రఘురామ్ రాజన్‌కు అరుదైన గౌరవం)

ఇక ఈ సమావేశం సందర్భంగా భారత్‌లో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ గురించి జార్జీవా ప్రముఖంగా ప్రస్తావించారు. ఆ సమయంలో భారత్‌ విధించిన ఆంక్షలు, విధాన నిర్ణయాలు బాగా పని చేసినట్లు ప్రశంసించారు. అంతేకాక భారత్‌ ఈ ఏడాది 2021ని తన ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవడం కోసం వినియోగించుకుంటుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక భారత్‌లో చేపడుతున్న నిర్మాణాత్మక సంస్కరణలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని.. భవిష్యత్తులో కూడా వీటిని కొనసాగించి మరింత ముందుకు వెళ్లాలని క్రిస్టాలినా జార్జీవా సూచించారు.

సాగు చట్టాలపై ఐఎంఎఫ్‌ స్పందన
ఇక నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై ఐఎంఎఫ్‌ స్పందించింది. వ్యవసాయ సంస్కరణల్లో సాగు చట్టాలు ఓ ముందడుగని తెలిపింది. వీటి వల్ల మధ్యవర్తుల అవసరం లేకుండానే రైతులు నేరుగా తమ పంటను అమ్ముకోవచ్చన్నది. అయితే ఈ నూతన చట్టాల వల్ల నష్టపోయే అవకాశం ఉన్నవారికి సామాజకి భద్రతను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని ఐఎంఎఫ్‌ స్పష్టం చేసింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

01-03-2021
Mar 01, 2021, 14:32 IST
ఎస్‌ఎస్‌ తాడ్వాయి: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క– సారలమ్మ ఆలయాన్ని సోమవారం నుంచి 21 రోజుల...
01-03-2021
Mar 01, 2021, 13:52 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రెండవ దశ  వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సోమవారం షురూ  అయింది. 60 ఏళ్లు పైబడిన, 45...
01-03-2021
Mar 01, 2021, 13:39 IST
తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,10,96,731కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కేవలం ఆరు రాష్ట్రాల్లోనే అధిక శాతం...
01-03-2021
Mar 01, 2021, 04:03 IST
సాక్షి, హైదరాబాద్‌: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45–59 ఏళ్ల వయసు వారికి కరోనా టీకా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది....
01-03-2021
Mar 01, 2021, 02:50 IST
న్యాయస్థానంలో ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయవాది తన వాదనలు వినిపించేందుకు మాస్క్‌ను తొలిగించి వాదనలకు ఉపక్రమించాడు. అది గమనించిన...
01-03-2021
Mar 01, 2021, 01:52 IST
వాషింగ్టన్‌: కరోనాతో అతలాకుతలమవుతున్న అగ్రరాజ్యం అమెరికా మూడో వ్యాక్సిన్‌కి అనుమతులు మంజూరు చేసింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ సంస్థ తయారు...
01-03-2021
Mar 01, 2021, 00:34 IST
రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి....
28-02-2021
Feb 28, 2021, 06:05 IST
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతుండడం కలవరం కలిగిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి...
28-02-2021
Feb 28, 2021, 03:38 IST
ప్రైవేట్‌ హాస్పిటళ్లలో కరోనా టీకా ధరను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఒక్కో డోసుకు రూ.250 వరకు వసూలు చేయొచ్చని...
27-02-2021
Feb 27, 2021, 14:54 IST
.అన్ని ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద ఉచితంగానే టీకా ఇస్తారని, కానీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని భావిస్తే ముందుగా నిర్ణయించిన...
27-02-2021
Feb 27, 2021, 13:29 IST
దౌత్యవేత్తలు దాదాపు 32 గంటల పాటు ట్రాలీని రైలు పట్టాలపై తోసుకుంటూ
25-02-2021
Feb 25, 2021, 10:24 IST
సాక్షి, ముంబై : పుణేకు చెందిన అజయ్‌ మునోత్‌ (50) అనే వ్యక్తి ప్లాస్మా దానం చేసి ఏకంగా తొమ్మిది...
25-02-2021
Feb 25, 2021, 09:52 IST
జంక్‌ఫుడ్‌ జోలికీ వెళ్లకుండా పసుపురంగులోని కిస్‌మిస్‌లను రోజూ తినడం వల్ల ఆరోగ్యంగా ఉన్నారు
25-02-2021
Feb 25, 2021, 09:15 IST
అక్రా: భారత్‌లోని పుణెలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ తయారు చేస్తున్న కోవిషీల్డ్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ 6 లక్షల డోసులు ఘనా దేశానికి చేరుకున్నాయి....
25-02-2021
Feb 25, 2021, 03:43 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ సిబ్బందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమం మొదలైంది. మంగళగిరిలోని పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం...
25-02-2021
Feb 25, 2021, 01:15 IST
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి మళ్లీ ఉధృతరూపం దాల్చుతోంది. వాషీం జిల్లా రిసోడ్‌ తాలూకా దేగావ్‌లోని ఓ రెసిడెన్షియల్‌...
24-02-2021
Feb 24, 2021, 10:14 IST
మాస్క్‌ ధరించని వారి నుంచి ఏకంగా 30,50,00,000 రూపాయలు వసూలు
24-02-2021
Feb 24, 2021, 03:16 IST
కరోనా టైంలో చాలా దేశాల్లో లాక్‌డౌన్‌ పెట్టారు.. మన దగ్గరా పెట్టారు.. ఇంతకీ ఈ ఉపద్రవం సమయంలో అత్యంత కఠినంగా...
24-02-2021
Feb 24, 2021, 03:14 IST
పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో కోవిడ్‌ భయం నెలకొంది.
23-02-2021
Feb 23, 2021, 18:58 IST
సాక్షి, హైదరాబాద్‌ : దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top