Turkey Fitness Model: ‘నగ్నంగా ఏం లేను కదా’ అంటూ ఏడుస్తూ వీడియో, ఆపై ట్విస్ట్‌..

Fitness Model Deniz Saypinar Stopped From Boarding Flight For Too Short Dress - Sakshi

ఆడవాళ్ల వేషధారణ సొసైటీలో ఎడతెగని ఓ చర్చాంశం. అయితే తన దేశంలో వివక్ష ఎదురవుతుందనే.. ఆమె వెస్ట్రన్‌ దేశాలకు వలస వెళ్లింది. అక్కడ తనకంటూ ఓ గుర్తింపు దక్కించుకుంది. కానీ, ఊహించని రీతిలో అక్కడా ‘చేదు’ అనుభవమే ఎదురయ్యిందంటూ కన్నీళ్లతో వాపోయింది. కానీ..

దెనిజ్‌ సెపినర్‌(26).. టర్కీ ఫిట్‌నెస్‌ మోడల్‌. అయితే అక్కడి సంప్రదాయలు ఆమెను ప్రొఫెషనల్‌లోకి అనుమతించలేదు . దీంతో అమెరికాకు వలస వెళ్లింది. ఫిట్‌నెస్‌ మోడల్‌గా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు సంపాదించుకుంది. ఇంటర్నేషనల్‌ గుర్తింపు దక్కించుకున్న మొదటి టర్కీ బాడీ బిల్డర్‌ కూడా ఈమెనే. ఈ క్రమంలో బికినీ మోడలింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొనేందుకు జులై 8న మియామీ నుంచి టెక్సాస్‌కు బయలుదేరింది. అయితే ఫ్లైట్‌ ఎక్కిన కాసేపటికే సిబ్బంది ఒకరు వచ్చి.. ‘మీరు దిగిపోవాలి’ అన్నాడు. ఆమె అది జోక్‌గా అనుకుందట. దీంతో ‘మీ బట్టలు బాగోలేవు. మీ వల్ల ఇందులో ఉన్న ఫ్యామిలీస్‌ ఇబ్బంది పడతాయి. దిగిపోండి’ అని మరోసారి చెప్పాడట.

కావాలంటే తన టీషర్ట్‌తో కాళ్లను కప్పేసుకుంటానని ఆమె చెప్పినప్పటికీ.. వినకుండా ‘మీరు నగ్నంగా ఉన్నారు. దిగిపోవాల్సిందేన’ంటూ ఆమెతో దురుసుగా వ్యవహరించారట. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకుని వాపోయిందామె.‘ఆ మాట వినగానే భయమేసింది. వణికిపోయా. వాళ్లసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదు. నేనేం నగ్నంగా లేను కదా. రాత్రంతా ఒంటరిగా ఎయిర్‌పోర్ట్‌లో ఉండిపోయా. నా దేశంలో స్వేచ్ఛ లేదనే ఇక్కడికి వచ్చా. కానీ, ఇలాంటి ఘటన ఎవరికీ జరగకూడదు’ అంటూ కన్నీళ్లతో వీడియోను పోస్ట్‌ చేసింది దెనిజ్‌.

 

ట్విస్ట్‌
అయితే దెనిజ్‌ దుస్తులు మరీ బికినీ తరహాలో కురచగా ఉన్నాయని, అందుకే ఆమెను దించేశామని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది. ‘ఫ్లైట్స్‌లో వెళ్లేవాళ్లకు కొన్ని రూల్స్‌ ఉంటాయి. ఎలా పడితే అలా బట్టలు వేసుకొస్తే.. అవతలి వాళ్లు ఇబ్బంది పడతారు కదా. ఆమె వేషధారణ అసభ్యంగా ఉందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం మా సిబ్బంది చేసింది. కానీ, ఆమెనే దురుసుగా ప్రవర్తించడంతో ప్రతిగా అలా చేయాల్సి వచ్చింద’ని అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ స్పష్టం చేసింది. దీంతో ఆమెకే నెగెటివ్‌ కామెంట్లు వస్తుండడంతో ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు కాసేపు ప్రైవసీ పెట్టేసిందామె.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top