తాలిబన్ల ఇంటర్వ్యూ తర్వాత ఓ అఫ్గాన్‌ మహిళా జర్నలిస్టు స్పందన | Sakshi
Sakshi News home page

తాలిబన్ల ఇంటర్వ్యూ తర్వాత ఓ అఫ్గాన్‌ మహిళా జర్నలిస్టు స్పందన

Published Thu, Aug 19 2021 9:47 PM

Female Afghan Journalists Talk About Life After Taliban Takeover - Sakshi

తాలిబన్ల అరాచకాలు అంతా ఇంతా కాదు.. స్త్రీలకు విద్య నిషేధించడం, బురఖా తప్పనిసరి చేయడం, హక్కులను కాలరాయడం, లైంగికబానిసలుగా మార్చడం వంటి అరాచకాలు కోకొల్లలు. అయితే మహిళలు బాధితుల్లా మారడం మాకు ఇష్టం లేదు. షరియా చట్టాలను అనుసరించి ప్రభుత్వ వ్యవస్థలో వారు కూడా భాగస్వామ్యం కావొచ్చు అంటూ  ఓ మహిళా జర్నలిస్టుకు తాలిబన్లు ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ప్రస్తుతం అక్కడి వాస్తవ పరిస్థితులపై షబ్నమ్ దావ్రాన్‌ అనే అఫ్గాన్‌ జర్నలిస్టు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

ప్రశ్న: మహిళలు తమ హక్కులన్నీ కలిగి ఉంటారని తాలిబన్‌లు చెప్పారు. అసలు అక్కడ ఏం జరిగిందో చెప్పండి?
జవాబు: నేను స్టేట్ రన్ అనే వార్తా సంస్థ (ఆర్‌టీఏ) పాష్టోలో పని చేస్తున్నారు. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజు ఉదయం నేను పనిచేసే కార్యాలయాని వెళ్లాను. వారు నన్ను ఇక నుంచి పనికి రావొద్దని చెప్పారు. కారణం ఏంటని అడిగాను. అయితే ఇప్పుడు నియమాలు మారాయని, మహిళలు ఇకపై ఆర్‌టీఏలో పని చేయడానికి అనుమతి లేదన్నారు.

అయితే మహిళలు చదువుకోవడానికి, పనికి వెళ్లడానికి అనుమతి ఉంటుందని తాలిబన్లు ప్రకటించినప్పుడు నేను ఆనంద పడ్డాను. అయితే నా ఆఫీసులో మహిళలు పని చేయడానికి అనుమతించమని నన్ను రానివ్వలేదు. నేను వారికి నా గుర్తింపు కార్డులను చూపించాను. అయినప్పటికీ నన్ను ఇంటికి వెళ్లమన్నారు.

ప్రశ్న: ఇతర ఛానెల్‌ల మహిళా యాంకర్‌లకు కూడా ఇదే విధమైన ఆదేశాన్ని ఇచ్చారా?
జవాబు: లేదు.. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే మహిళలను మాత్రమే పనికి రానివ్వమని తెలిపారు. టోలో న్యూస్‌ ఓ ప్రైవేట్ ఛానెల్ అందువల్ల అక్కడి మహిళల కోసం ఇలాంటి ఆదేశాన్ని జారీ చేయలేదు.

ప్రశ్న: ఓ మహిళగా మీకు ఏదైనా ప్రత్యేక ప్రమాదం వాటిల్లిందా?
జవాబు: నీవు ఓ మహిళవు. ఇప్పుడే ఇంటికి వెళ్లన్నారు. అయితే నా సహోద్యోగిని మాత్రం పనికి వెళ్లడానికి అనుమతించారు. మహిళలు ఇకపై ఆర్‌టీఏలో పనిచేయడానికి వీలులేదని వారు స్పష్టంగా తెలియజేశారు.

ప్రశ్న: తాలిబన్లతో ఓ మహిళా ఇంటర్వ్యూ చూసినపుడు చాలా మంది సంతోషించారు. కానీ మీ కథను చూసిన తర్వాత, అది కేవలం ఓ పార్శ్వంగా మాత్రమే అనిపిస్తుంది.
జవాబు: అవును, అది టోలో న్యూస్‌లో ఉంది.  నా స్నేహితులలో ఒకరు ఆ ఇంటర్వ్యూ తీసుకున్నారు. తాలిబన్లు మళ్లీ అధికారంలోకి వస్తే మహిళలకు ఏం జరుగుతుందనే ఆలోచన అందరికీ ఉంది. కానీ తాలిబన్లతో ఇంటర్వ్యూ తర్వాత, పరిస్థితులు భిన్నంగా ఉండవచ్చు అనుకున్నాం. కానీ తాలిబన్లు ప్రభుత్వానికి సంబంధించిన మీడియాతో అలా చేయడం మంచిది కాదు. 


ప్రశ్న: మీరు ఇతర మహిళా జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతారు? మీలాగ పని చేసే మహిళలకు భవిష్యత్‌లో ఏదీ ఉండదని మీరు అనుకుంటున్నారా?
జవాబు: ప్రస్తుతానికి నాకు ఏం అర్థం కావడం లేదు.  అంతేకాకుండా భవిష్యత్తులో ఏం జరుగుతుందో కూడా తెలియదు.

ప్రశ్న: మీరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బయటపడాలనుకుంటున్నారా?
జవాబు: నేను ఇకపై ఇక్కడ పని చేయలేను. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో జీవించడం చాలా కష్టం. నాకు ఏదైనా మద్దతు లభిస్తే, నేను వెళ్ళిపోతాను.

ప్రశ్న: మీ కుటుంబం గురించి ఆలోచిస్తే మీరు భయపడుతున్నారా?
జవాబు: అవును, నా జీవితం కంటే, నేను వారి కోసమే ఎక్కువ భయపడుతున్నాను.

Advertisement
 
Advertisement
 
Advertisement