మయన్మార్‌ మిలటరీ ఫేస్‌బుక్‌ పేజీ తొలగింపు

Facebook takes down main page of Myanmar military - Sakshi

యాంగాన్‌: మయన్మార్‌లో పోలీసుల కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించడం పట్ల ఫేస్‌బుక్‌ యాజ మాన్యం విచారం వ్యక్తం చేసింది. మయన్మార్‌ మిలటరీ ప్రధాన పేజీని ఫేస్‌బుక్‌ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. తాము పాటిస్తున్న ప్రమాణాల ప్రకారం హింసను రెచ్చగొట్టే అంశాలను కచ్చితంగా తొలగిస్తామని వెల్ల్లడించింది. మయన్మార్‌ సైన్యం తాత్‌మదా ట్రూ న్యూస్‌ ఇన్ఫర్మేషన్‌ టీమ్‌ పేరిట ఫేస్‌బుక్‌ పేజీని నిర్వహిస్తోంది. ఆ పేజీ ఇప్పుడు కనిపిం చడం లేదు.  కాగా, పోలీసు దమనకాండను ఖండిస్తూ ఆదివారం దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి.  ఫిబ్రవరి 9న పోలీసుల కాల్పుల్లో గాయపడిన 19 ఏళ్ల మయా థ్వెట్‌ ఖీనే  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూసింది. ఆమె అంత్యక్రియలను ఆదివారం యాంగాన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారీగా జనం పాల్గొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top