Coco Cola Lake: కోకాకోలా సముద్రం.. ఈత కూడ కొట్టొచ్చు.. ఎక్కడంటే?

Ever Dreamed of Swimming In Coca Cola, This Lake Can Make It a Reality - Sakshi

Brazil Coco Cola River Facts: ప్రపంచంలో మనకు తెలియని, ఊహలకు అందని అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ భూమి మొత్తం వింతలు విశేషాలతో నిండి ఉంది. మనకు తెలిసే వరకు అది ఏదైనా ఒక ఆశ్చర్యమే. మరి కోకాకోలా ప్రవహించే మహాసముద్రం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి కోకాకోలా సముద్రం కూడా ఉందా, నిజమేనా అనుకుంటున్నారా. అవును, మీరు విన్నది నిజమే. బ్రెజిల్‌లోని రియో ​​గ్రాండే డెల్ నార్టేలోని కోకా కోలా సరస్సు ఉంది. అక్కడ మీరు ఈత కూడా కొట్టవచ్చు. ఇక్కడి సరుస్సులోని నీరు అచ్చం కోకా కోలా డ్రింక్‌ కలర్‌లోనే ఉంటాయి.

ఈ ప్రదేశంలోని నీటి ముదురు గోధుమ మరియు నలుపు రంగు, ఇది ఖచ్చితంగా కోకా కోలా వలె కనిపిస్తుంది. ఒక్కసారి మనం అ లేక్‌ వద్దకు వెళితే నీటికి బదులు కోకాకోలానే సరస్సులో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది.ఈ నీటిలో ఇనుము, అయోడిన్ గాఢత ఎక్కువ ఉండటం వల్ల ఈ నీటికి ఇలా రంగు ఉందని పరిశోధనల్లో తేలింది. దీని కారణంగానే ఇక్కడి నీటికి కోలా నీటిలా కనిపిస్తుంది. వేసవిలో బీచ్ జీవితాన్ని ఆస్వాదించడానికి ఇక్కడ నివసించే ప్రజలు తరచుగా ఇక్కడకు వస్తారు.

తీరంవైపు ఉన్న నీరు లేత ముదురు రంగులో కనిపిస్తుంది. అదే సముద్రంలోకి వెళితే ముదురు రంగులోకి మారుతుంది. నీటికి ఉన్న వింత రంగు కారణంగా ప్రజలు ఇక్కడికి రావడానికి ఇష్టపడుతున్నారు. చాలా మంది టూరిస్టులు తమ కుటుంబంతో విహారయాత్రకు రావడానికి ఇష్టపడుతుంటారు. ఈ ప్రాంతం టూరిస్టులతో నిత్యం సందడిగా ఉంటుంది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top