దక్షిణ కొరియాలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు | Earthquake Tremors Felt in South Korea With Magnitude Of 4.8, Details Inside | Sakshi
Sakshi News home page

దక్షిణ కొరియాలో భూకంపం.. 4.8 తీవ్రత నమోదు

Published Wed, Jun 12 2024 11:12 AM | Last Updated on Wed, Jun 12 2024 12:15 PM

Earthquake Tremors Felt in South Korea

దక్షిణ కొరియాలో భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు బువాన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. ఈ వివరాలను వాతావరణ శాఖ మీడియాకు తెలియజేసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైనట్లు పేర్కొంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం 2024లో ఇప్పటివరకూ దక్షిణ కొరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇదే. అయితే ఈ భూకంపం కారణంగా నష్టం వాటిల్లినట్లు ఇప్పటి వరకూ సమాచారం లేదు. నార్త్ జియోల్లా ప్రావిన్స్‌లోని అగ్నిమాపక శాఖ అధికారి జో హే-జిన్ మీడియాతో మాట్లాడుతూ ఈ భూకంపానికి సంబంధించి వివిధ ప్రాంతాల ‍ప్రజల నుంచి సుమారు 80 కాల్స్‌ వచ్చాయన్నారు. ఈ భూకంపం కారణంగా బువాన్‌లో ఓ ఇంటి గోడ కూలిపోయిందనే  వార్తలు వినిపిస్తున్నాయి.

భూకంపాలను వాటి తీవ్రత పరంగా వివిధ వర్గాలుగా విభజిస్తారు. 2.5 నుండి 5.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు మైనర్ కేటగిరీలో ఉంటాయి. 5.5 నుండి 6 తీవ్రతతో వచ్చే భూకంపం స్వల్ప స్థాయిలో ప్రమాదకరమైన భూకంపంగా పరిగణిస్తారు. 6 నుండి 7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లయితే, నష్టం జరిగే అవకాశం ఉంటుంది. 7 నుండి 7.9 తీవ్రతతో సంభవించే భూకంపాలు ప్రమాదకరమైనవిగా పరిగణిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement