ఇరాన్‌లోని వాటన్నింటినీ ధ్వంసం చేసేస్తాం: ట్రంప్‌ | DonaldTrump Iran decided to fire bullets yesterday | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లోని వాటన్నింటినీ ధ్వంసం చేసేస్తాం: ట్రంప్‌

Apr 19 2026 6:20 PM | Updated on Apr 19 2026 7:31 PM

DonaldTrump Iran decided to fire bullets yesterday

వాషింగ్టన్‌: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌ ఇచ్చారు. హార్మూజ్‌ విషయంలో కొనసాగుతున్న నిర్బంధం, పాకిస్థాన్‌లో ఇరాన్‌తో అమెరికా రెండో దశ చర్చలు వంటి అంశాలపై ఆయన ట్రూత్‌ సోషల్‌లో ప్రస్తావించారు. ఇరాన్‌ వ్యవహరిస్తున్న తీరు సరికాదని అన్నారు. హార్మూజ్‌ విషయంలో ఇరాన్‌పై సెటైర్లు వేశారు. 

‘ఇరాన్ నిన్న హార్మూజ్ జలసంధిలో కాల్పులు జరపాలని నిర్ణయించింది. ఇది కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘన. చాలావరకు ఫ్రాన్స్ నౌకపై, యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి వచ్చిన సరుకు నౌకను ఇరాన్‌ లక్ష్యంగా చేసుకుంది. అది మంచిది కాదు, కదా?

నా ప్రతినిధులు చర్చల కోసం పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌కు వెళ్తున్నారు. వారు రేపు సాయంత్రం అక్కడ ఉంటారు. ఇరాన్ ఇటీవల జలసంధిని మూసేస్తున్నామని ప్రకటించింది.. ఇది విచిత్రం.. ఎందుకంటే మా నిర్బంధం (బ్లాకేడ్) ఇప్పటికే దాన్ని మూసేసింది.

వారు తెలియకుండానే మాకు సాయం చేస్తున్నారు, మూసిన మార్గంతో నష్టపోయేది వారే, రోజుకు 500 మిలియన్ డాలర్లు నష్టపోతారు. అమెరికాకు ఏ నష్టమూ లేదు. నిజానికి, చాలా నౌకలు ఇప్పుడే అమెరికాలోని టెక్సాస్, లూసియానా, అలాస్కా వైపు వెళ్తున్నాయి. మేము చాలా న్యాయమైన, సరైన ఒప్పందాన్ని ప్రతిపాదిస్తున్నాం. 

ఇరాన్‌ దాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే అలా చేయకపోతే, ఇరాన్‌లో ప్రతి విద్యుత్ కేంద్రం, ప్రతి వంతెనను అమెరికా ధ్వంసం చేస్తుంది. వారు త్వరగా దిగివస్తారు, సులభంగా దిగివస్తారు, వారు ఒప్పందాన్ని అంగీకరించకపోతే చేయాల్సిన పనిని చేయడమే నాకు గౌరవంగా ఉంటుంది. గత 47 సంవత్సరాలుగా ఇతర అధ్యక్షులు చేయలేని పని అదే. ఇరాన్ హత్యాకాండ ఆగాల్సిన సమయం వచ్చింది’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement