
న్యూఢిల్లీ: రష్యా ఆయిల్‌ను కొనుగోలు చేస్తున్నందుకు భారత వస్తువులపై 25 శాతం అదనపు సుంకాన్ని విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరోసారి అక్కసు వెళ్లగక్కారు. షాంఘై సదస్సు లో చైనా, రష్యా అధ్యక్షులతో భారత ప్రధాని మోదీ కలిసి కీలక అంశాలపై ముందడుగు వేసిన తరుణంలో ట్రంప్ తన మసనులోని మాటను బయటపెట్టారు.
అమెరికాకు భారత్ అత్యధికంగా ఎగుమతులు చేసుకుంటూ భారీగా లాభపడిందని, అదే సమయంలో తమ వస్తువులు భారత్‌లో దిగుమతి చేసుకోవడానికి మాత్రం చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే అవకాశం ఇచ్చిందన్నారు.
‘మా దేశానికి భారత్ పలు రంగాల ఎగుమతులు చేసుకుంటూ భారీ లబ్ధి పొందుతోంది. కానీ మమ్మల్ని భారత్ మార్కెట్‌లోకి వచ్చే అంశంలో మాత్రం చాలా పరిధిలోనే ఉంచుతుంది. మా దేశం నుంచి భారత్ దిగుమతి చేసుకునేవి చాలా తక్కువ. చివరకు ఆయిల్ కొనుగోలు విషయంలో కూడా రష్యాకే భారత్ అధిక ప్రాధాన్యం ఇస్తుంది. అమెరికా నుంచి భారత్ కొనే ఆయిల్ చాలా తక్కువ పరిమితిలోనే ఉంటుంది.
ఇప్పుడు తాము భారత్‌కు దిగుమతి చేసే వస్తువుల విషయంలో టారిఫ్‌ల్లో .జీరోశాతం ఇస్తామని ఆఫర్ చేసింది. ఆ సమయం దాటి పోయింది. ఇది గతేడాది క్రితం జరిగాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. భారత్ అధక సుంకాల కారణంగా మా వస్తువుల్ని భారత్‌లో అమ్మలేకపోతున్నాం’ అని పేర్కొన్నారు.
ఇది ఏకపక్ష విధ్వంసంగా ట్రంప్ అభివర్ణించారు. భారత్ అమెరికాకు భారీగా వస్తువులు అమ్ముతూ, అమెరికా కంపెనీలకు భారత మార్కెట్‌లో ప్రవేశం ఇవ్వకుండా “అత్యధిక టారిఫ్‌లు విధిస్తూ వచ్చిందన్నారు. అయితే ఇప్పుడు భారత్ సుంకాలను తగ్గించేందుకు సిద్ధమైందని, కానీ అది ఇప్పటికే చాలా ఆలస్యమైపోయిందన్నారు.
ఇదిలా ఉంచితే, భారత్ వస్తువులపై తొలుత 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్.,. ఆపై రష్యన్ ఆయిల్ కొనుగోలు పేరుతో భారత్‌పై మరో 25 శాతం సుంకాన్ని విధించారు. ఫలితంగా భారత్‌పై 50 శాతం సుంకాల భారం పడింది. ఇది భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వస్త్రాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు, చర్మ ఉత్పత్తులు ఇలా పలు రంగాలపై అమెరికా సుంకాల భారాన్ని భారత్ భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరొకవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆత్మనిర్బర్ భారత్‌ను ప్రోత్సహిసతఊ దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పంచాలని ప్రజలకు పదే పదే పిలుపునిస్తూ వస్తున్నారు.