భారత్‌కు మరో షాకిచ్చిన ట్రంప్‌.. మోదీ కీలక భేటీ! | Donald Trump Says Halts Trade Talks With India Amid Tariff Row, Watch Video Inside | Sakshi
Sakshi News home page

భారత్‌కు మరో షాకిచ్చిన ట్రంప్‌.. మోదీ కీలక భేటీ!

Aug 8 2025 9:25 AM | Updated on Aug 8 2025 11:13 AM

Donald Trump Says halts trade talks with India amid tariff row

వాషింగ్టన్‌: రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. భారత్‌ను టార్గెట్‌ చేసి అదనపు సుంకాలు విధిస్తున్నారు. ఇక, తాజాగా భారత్‌ సుంకాలపై మరోసారి ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుంకాల విషయంలో భారత్‌తో చర్చలకు తాను సిద్ధంగా లేనని కుండబద్దలు కొట్టారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మరో చర్చకు దారి తీశాయి.

వివరాల ప్రకారం.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో భారత్‌పై అమెరికా విధించిన అదనపు సుంకాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలను విధించడంతో ట్రంప్‌ విధించిన భారాన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని భారత్‌ చూస్తోంది. అయితే, అందుకు అధ్యక్షుడు ట్రంప్‌ మాత్రం సిద్ధంగా లేనట్లు స్పష్టం చేశారు. తాజాగా ట్రంప్‌ ఓ కార్యక్రమంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. టారిఫ్‌ల వివాదం పరిష్కారం అయ్యే వరకు భారత్‌తో ఎలాంటి వాణిజ్య చర్చలు ఉండవు అని తేల్చి చెప్పారు. దీంతో, భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ ఎదురైంది. ఇదిలా ఉండగా.. రష్యా నుంచి చమురు కొనుగోలు కొనసాగితే భారత్‌పై మరిన్ని ఆంక్షలు ఉంటాయని ట్రంప్‌ మళ్లీ హెచ్చరించడం గమనార్హం.

ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీకి సిద్ధమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్‌ సమావేశం జరగనుంది. ట్రంప్‌ టారిఫ్‌లపై భారత్‌ ఎలా స్పందించాలనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అమెరికా విదేశాంగ శాఖ కీలక ప్రకటన..
మరోవైపు.. డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యలకు విరుద్ధంగా అమెరికా విదేశాంగ శాఖ మరో ప్రకటన చేసింది. విదేశాంగశాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్‌ విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌ వ్యూహాత్మక భాగస్వామి అని పేర్కొన్నారు. టారిఫ్‌ల నేపథ్యంలో ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత కొనసాగుతున్నప్పటికీ ఆ దేశంతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామన్నారు. వాణిజ్యం, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి విషయాల్లో ట్రంప్‌  స్పష్టంగా ఉన్నారన్నారు. దానికి  ప్రతిస్పందనగానే ట్రంప్‌ నేరుగా చర్యలు తీసుకున్నారని చెప్పుకొచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement