డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!

China Not Worried Any Domino Effect Of Olympic Boycotts - Sakshi

బీజింగ్‌: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరమైన బహిష్కరణల "డొమినో ఎఫెక్ట్" గురించి తాము ఆందోళన చెందడం లేదని చైనా పేర్కొంది. ఈ మేరకు పశ్చిమ ప్రాంతమైన జిన్‌జియాంగ్‌లో చైనా మానవ హక్కుల "దౌర్జన్యాలు" కారణంగా చైనాలో జరుగుతున్న ఒలింపిక్‌ క్రీడలకు తమ ప్రభుత్వ అధికారులు హాజరుకావడం లేదని అమెరికా దౌత్యపరమైన బహిష్కరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాము డొమినో ప్రభావం గురించి ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు.

అంతేకాదు ప్రపంచంలోని చాలా దేశాలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు మద్దతు తెలిపాయంటూ సమర్థించే ప్రయత్నం చేశారు. అయితే దేశాలన్ని రాజకీయాలకు అతీతంగా ఈ అంతర్జాతీయ క్రీడలకు ఏకంకావాలని పిలువపునివ్వడమే కాక అందుకై 170కి పైగా దేశాలు చేసిని తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించిన విషయాన్ని వాంగ్‌ ప్రస్తావించారు. అంతేకాదు కొంతమంది విదేశీ నాయకులు, రాజ కుటుంబాల సభ్యులు ఈ ఒలింపిక్‌ క్రీడలకు హాజరు కావడానికి నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు.

ఈ క్రమంలో చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్‌ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రధాన దేశానికి బహిరంగంగా ఆహ్వానాన్ని అంగీకరించిన ఏకైక నాయకుడు అని ప్రశంసించారు. అమెరికా మాదిరిగానే బ్రిటన్‌, కెనడా, ఆస్ట్రేలియా బీజింగ్‌ వింటర్‌ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమకు బ్రిటన్, కెనడా దేశాల అధికారులను క్రీడలకు ఆహ్వానించే ఆలోచన చైనాకు లేదని వాంగ్‌ స్పష్టం​ చేశారు. అంతేకాదు అమెరికా దాని మిత్ర దేశాలు తమ రాజకీయ ఎత్తుగడ కోసం ఒలింపిక్‌ క్రీడలను వేదికగా ఎంచుకున్నాయని, అందుకు ఆయా దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని వాంగ్‌ విరుచుకుపడ్డారు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top