హే!..రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్‌ వ్యాక్సిన్‌!!

Children Pfizer Covid Vaccine Will Be Available as of December 13 in EU - Sakshi

Children Pfizer Covid Vaccine: యూరోపియన్‌ యూనియన్‌లో కోవిడ్‌ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేసే ప్రధాన కంపెనీలైన బయో ఎన్‌టెక్‌/ఫైజర్‌లు మరో రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకురానుందని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. ఈ మేరకు ఆమె కరోనా మహమ్మారి సమస్య గురించి జర్మన్-యుఎస్ జాయింట్ వెంచర్‌తో మాట్లాడానని పైగా వారు తమ పరిశోధనలు మరింత వేగవంతం చేస్తున్నారని చెప్పారు.

(చదవండి: ఆ తప్పుడు ఆరోపణే ఆమెను కోట్లాధికారిని చేసింది!!)

అంతేకాదు ఆమె ఈయూలోని పిల్లలకు డిసెంబర్ 13 నాటికల్లా ఫైజర్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో వస్తాయని అన్నారు. అయితే సౌతాఫ్రికాలోని బోట్స్‌వానాలో గురించిన ఒమిక్రాన్‌ కొత్త కరోనా వేరియంట్‌తో హడలిపోతూ భయం గుప్పెట్లో బతుకుతున్న ప్రపంచదేశాలన్నించి ఈ విషయం కాస్త ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి.

(చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్‌ వైరస్‌ 12 దేశాలను చుట్టేసింది!!)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top