వామ్మో!.. చూడటానికే భయంగా ఉంది.. కనుగుడ్లను బయటకు పెట్టి.. గిన్నిస్‌ రికార్డు

Brazilian Man SetsGuinness World Record for Farthest Eyeball Pop - Sakshi

ఫొటో చూస్తుంటేనే భయం వేస్తోంది కదూ.. బ్రెజిల్‌కు చెందిన సిడ్నీ డీ కార్వల్హో అనే పెద్దాయన స్పెషాలిటీ ఇదే. అదేనండి.. గుడ్లురుమి చూడటం.. అంటే కనుగుడ్లను ఇలా అసాధారణంగా బయటకు పెట్టగలగడం అన్నమాట.. అందుకే గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకులు ఆయన్ను ప్రపంచంలోకెల్లా అత్యంత దూరంపాటు కనుగుడ్లను బయటకు ప్రదర్శించగల (పురుషుల్లో) వ్యక్తిగా గుర్తిస్త రికార్డు కట్టబెట్టారు. ఇంతకీ సిడ్నీ తన కనుగుడ్లను ఎంత దరం బయటకు చూపగలరో తెలుసా? కనుగుంటల నుంచి ఏకంగా 18.2 మిల్లీమీటర్లు లేదా 0.71 అంగుళాల దూరంపాటు కనుగుడ్లను బయటకు ప్రదర్శించగలరు.

ఇలా సుమారు 30 సెకన్లపాటు ఆయన ఉండగలరట. అయితే ఆయన కనుగుడ్లను తిరిగి సాధారణ స్థితికి తీసుకొచ్చే దాకా ఆయనకు ఏమీ కనిపించదట! అమెరికాకు చెందిన కిమ్‌ గుడ్‌మ్యాన్‌ అనే మహిళ సైతం ఇదే రకమైన ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంది. కనుగుడ్లను కనుగుంటల నుంచి 12 మిల్లీమీటర్లు లేదా 0.47 అంగుళాల దూరంపాటు ప్రదర్శించగలదు. అందుకే మహిళల కేటగిరీలో ఈ రికార్డు గతంలోనే ఆమెను వరించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top