బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదం, 26 మంది మృతి | Boat Accident Padma River In Bangladesh | Sakshi
Sakshi News home page

పద్మా నదిలో బోటు తిరగబడి 26 మంది మృతి

May 4 2021 8:37 AM | Updated on May 4 2021 11:50 AM

Boat Accident Padma River In Bangladesh - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో అత్యంత వేగంగా వెళుతున్న బోటు తిరగబడిన ఘటనలో 26 మంది మరణించారు. మరో అయిదుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన సోమవారం ఉదయం మదారిపూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. ఇసుకను తీసుకెళ్లే కార్గో పడవను ప్రయాణికులతో వెళుతున్న బోటు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదం జరిగినప్పుడు అనుభవం లేని ఓ బాలుడు దాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు.

బుధవారం వరకూ కోవిడ్‌ ఆంక్షలు అమల్లో ఉన్నప్పటికీ, వాటిని పాటించకుండా ఒకే పడవలో 30 మందిని ఎక్కించారని ప్రమాదం నుంచి బయటపడిన వారు తెలిపారు. మొత్తం 26 మృతదేహాలను నీటి నుంచి వెలికి తీశారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.

చదవండి: భారత్‌కు ఈయూ చేయూత

Advertisement
 
Advertisement
Advertisement