‘వెంటనే అఫ్గానిస్తాన్‌ విడిచి అమెరికా వెళ్లండి’ | America Urges Citizens To Immediately Leave Afghanistan Over Taliban Attacks | Sakshi
Sakshi News home page

‘వెంటనే అఫ్గానిస్తాన్‌ విడిచి అమెరికా వెళ్లండి’

Aug 7 2021 4:54 PM | Updated on Aug 7 2021 5:11 PM

America Urges Citizens To Immediately Leave Afghanistan Over Taliban Attacks - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ నుంచి అమెరికా, యూరప్‌ దేశాల సైన్యం ఉపసంహరణతో తాలిబన్లు ఒక్కో​ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం  అమెరికా శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. తాలిబన్‌ దాడులతో అట్టడుకుతున్న ఆఫ్గానిస్తాన్‌ దేశాన్ని విడిచి తమ పౌరులు వెంటనే ఆమెరికాకు వెళ్లాలని పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లో పెరుగుతున్న హింస నేపథ్యంలో అమెరికన్లకు భద్రతాపరమైన రక్షణ కల్పించడం పరిమితంగా మారిందని కాబూల్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా రాయబార కార్యాలయంలో అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల్లో అమెరికా పౌరులు అఫ్గానిస్తాన్‌​ నుంచి అమెరికాకు బయలుదేరాలని కోరింది. 

వాణిజ్య విమానాల టికెట్లను కొనుగోలు చేయడానికి వీలుకాని వారికి లోన్‌ రూపంలో టికెట్లకు డబ్బులు అందజేస్తామని వెల్లడించింది. కాబూల్ నగరం వెలుపల దేశీయ విమానాలు, రోడ్డు మార్గాలు పరిమితంగా ఉన్నాయిని, కొన్ని రహదారులు మూసివేసినట్లు పేర్కొం‍ది. తాలిబన్లు ఇప్పటికే అఫ్గానిస్తాన్‌లోని పలు ప్రాంతాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం అఫ్గానిస్తాన్‌ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్‌ మీడియా సెంటర్‌ డైరెక్టర్‌ను తాలిబన్లు కాల్చి చంపి విధ్వంసం సృష్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement