ఉక్రెయిన్‌ వార్‌: తండ్రిని కోల్పోయినా నిందించని గొప్పగుణం

9 Year Girl Shot By Russian Troops Didnt Mean To Hurt Me  - Sakshi

Russian Invasion Girl Lost Her Father and Arm: ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న రోజుల తరబడి పోరులో వేలాదిమంది ఉక్రెయిన్‌ పౌరులు, చిన్నారులు మరణిస్తున్నారు. లక్షలాదిమంది ఉక్రెయిన్‌ని విడిచి వలస వెళ్తున్నారు. అయితే ఇప్పటికే కొంతమంది ఉక్రెయిన్‌ వాసులు.. మిలటరీలో చేరి తమ దేశాన్ని కాపాడుకుంటామంటూ ముందుకువచ్చారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులనే భేదం లేకుండా తమ భూభాగంలో జరుగుతున్న పోరులో పాల్గొనేందుకు ఉత్సుకతను కనబర్చారు.

అంతేకాదు ఉక్రెయిన్‌వాసుల దేశభక్తి స్ఫూర్తి ప్రపంచ దేశాల ప్రశంసలను అందుకుంటుంది. ఇందంతా ఒక ఎత్తు అయితే రష్యా దాడిలో సాషా అనే 9 ఏళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడటమే కాక తం‍డ్రిని కోల్పోయింది. అయినా ఇదంతా అనుకోకుండా జరిగిందని చెప్పిందే తప్ప రష్యన్లు ఒక మాట కూడా అనలేదు. ఆ దాడిలో ఆమె చేతికి ఒక బుల్లెట్‌ దిగింది. ఆ చిన్నారి కుటుంబం హాస్టమెల్ నుంచి బయలుదేరుతున్నప్పుడూ రష్యన్‌ దళాల కాల్పుల్లో చిక్కుకుంది. ఆ కాల్పుల్లో చిన్నారి తండ్రి అక్కడకక్కడే మరణించాడు. దీంతో చిన్నారి తల్లి, సోదరి సెల్లార్‌లోకి పారిపోతుండగా.. ఆ చిన్నారి ఎడమ చేతికి బుల్లెట్‌ దిగింది.

దీంతో ఉక్రెయిన్‌ సైన్యం వారిని రక్షించి ఆ చిన్నారిని ఆసుపత్రిలో జాయిన్‌ చేసింది. అయితే వైద్యుల శస్త్ర చికిత్సలో భాగంగా ఆమె చేతిని తొలగించాల్సి వచ్చింది. కానీ ఆ చిన్నారి మాత్రం రష్యా దళలు మాపై కావాలని దాడి చేశారని అనుకోవడం లేదని చెప్పింది. పైగా ఇది అనుకోకుండా జరిగిన ఘటన అని చెప్పిందే తప్ప రష్యా బలగాలను నిందించలేదు. ఉక్రెయిన్‌ వాసుల మనసు చాలా విశాలమైనది అని నిరూపించింది.

(చదవండి: విద్యార్థిని మెడపై మోకాలితో నొక్కి, చేతులను కట్టి.. వీడియో వైరల్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top