మసీదు కిందుగా పైప్‌లైన్‌, భారీ పేలుడు

11 Died In Gas Pipeline Blast At Mosque In Bangladesh - Sakshi

బంగ్లాదేశ్‌లో ప్రమాదం

11 మంది దుర్మరణం

ఢాకా: మసీదు కిందుగా వెళ్తున్న గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిపోవడంతో బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో మసీదులో ప్రార్థనలు చేసుకుంటున్నవారిలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. బైటుస్‌ సలాట్‌ జేమ్‌ మసీదులో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రార్థనలు ముగించుకుని ఇంటికి బయల్దేరుతున్న క్రమంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు. మసీదులోని 6 ఏసీలు కూడా మంటల తీవ్రతకు పేలిపోయాయి. తీవ్రంగా గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని పోలీస్‌ ఉన్నతాధికారి జయేదుల్‌ ఆలాం చెప్పారు. ప్రమాద తీవ్రతలో చాలా మందికి 90 శాతానికి పైగా గాయాలయ్యాయని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని ఘటనపై విచారణ చేస్తున్నామని తెలిపారు.
(చదవండి: నువ్వు నిజంగా దేవుడివి సామి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top