కర్రతో బాది యువకుడి హత్య | - | Sakshi
Sakshi News home page

కర్రతో బాది యువకుడి హత్య

Mar 10 2024 8:15 AM | Updated on Mar 10 2024 9:47 AM

మృతి చెందిన విశాల్‌ సింగ్‌ - Sakshi

మృతి చెందిన విశాల్‌ సింగ్‌

గచ్చిబౌలి: మద్యం తాగిన అనంతరం తన సోదరి పట్ల అసభ్యంగా మాట్లాడటంతో ఓ యువకుడిని కర్రతో బాది హత్య చేసిన సంఘటన రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకన్న తెలిపిన మేరకు.. టోలీచౌకీకి చెందిన విశాల్‌ సింగ్‌(32) మణికొండకు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వేధింపుల నేపథ్యంలో యువతి కుటుంబ సభ్యులు మందలించడంతో సంవత్సర కాలంగా దూరంగా ఉన్నాడు. సోదరిని వేధించాడని మనసులో పెట్టుకొని విశాల్‌ సింగ్‌ను అతని బంధువెన అర్జున్‌సింగ్‌ ద్వారా యువతి సోదరుడు శ్యామ్‌ శుక్రవారం రాత్రి 8 గంటలకు మణికొండకు పిలిపించాడు.

అర్ధరాత్రి మద్యం తాగిన అనంతరం యువతి ప్రస్తావన రావడంతో విశాల్‌ సింగ్‌ ఆమెను అసభ్య పదజాలంలో దూషించాడు. దీంతో శ్యామ్‌ కర్రతో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శనివారం తెల్లవారు జామున 2 గంటలకు మృతి చెందాడు. యువతి సోదరుడు శ్యామ్‌ అలియాస్‌ షాను, అర్జున్‌తో పాటు బయ్యా, యువతి కుటుంబ సభ్యులైన సుమెన్‌, రాజేష్‌, సోనీ, అరుణ్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. నిందితులంతా పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement