లక్ష్యాల సాధనలో ‘అపార్’ కీలకం
కేయూ క్యాంపస్ : జాతీయ విద్యావిధానం–2020 లక్ష్యాల సాధనలో అకడమిక్ బ్యాంకు ఆఫ్ క్రెడిట్స్ ( ఏబీసీ) –అపార్ కీలకమని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. ప్రతీ విద్యార్థికి ఏబీసీ –అపార్‌పై అవగాహన కల్పించి సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. గురువారం క్యాంపస్‌లోని సెనెట్‌హాల్‌లో న్యూఢిల్లీకి చెందిన నేషనల్ అకడమిక్ డిపాజిటరీ సౌజన్యంతో విశ్వవిద్యాలయం విభాగాల అధిపతులు, ప్రిన్సిపాళ్లు, అనుబంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు అకడమిక్ బ్యాంకు ఆఫ్ క్రెడిట్స్( ఏబీసీ)–అపార్‌పై ఒకరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. అపార్ ఐడీ విద్యార్థుల విద్యా రికార్డులు, విజయాలకు జీవితకాల డిజిటల్ గుర్తింపు అందిస్తుందన్నారు. కేయూ క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ డైరెక్టర్ నర్సింహారావు మాట్లాడుతూ కళాశాలలు తమ పోటీతత్వాన్ని పెంచుకునేందుకు న్యాక్ గుర్తింపు కీలక పాత్రపోషిస్తుందన్నారు. డిజిటల్ ఇండియా కార్పొరేషన్ రీజనల్ కోఆర్డినేటర్ రవిపాండె పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏబీసీ–అపార్ ఆవశ్యకత, ఉపయోగాలు వివరించారు. పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఆసిం ఇక్బాల్, సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి


