చలో.. రాఖీ
గురువారం వరంగల్ రామన్నపేట, బట్టలబజార్, పిన్నావారి వీధి, హనుమకొండ చౌరస్తా, టైలర్ స్ట్రీట్, కాజీపేట చౌరస్తా తదితర ప్రాంతాలు రాఖీలు, స్వీట్స్ కొనుగోళ్లతో రద్దీ ఏర్పడింది. – హన్మకొండ కల్చరల్
రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు గురువారం వివిధ ప్రాంతాలకు వెళ్లడంతో హనుమకొండ, వరంగల్ బస్టాండ్లు, కాజీపేట, వరంగల్ రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. హనుమకొండ బస్‌స్టేషన్‌లో బస్సులు ఎక్కేందుకు పోటీలు పడడంతో కొంత తోపులాట జరిగింది. కాజీపేట స్టేషన్ ఎంట్రెన్స్ వద్ద ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్, జనరల్ టికెట్ కౌంటర్ల వద్ద బారులుదీరారు. ప్లాట్‌ఫామ్ సందడిగా మారింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ హనుమకొండ/కాజీపేట రూరల్


