‘సూపర్‌ స్పెషాలిటీ’ పనులు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సూపర్‌ స్పెషాలిటీ’ పనులు పూర్తి చేయాలి

Aug 28 2026 4:33 AM | Updated on Aug 28 2026 4:33 AM

‘సూపర్‌ స్పెషాలిటీ’ పనులు పూర్తి చేయాలి

వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద

కాశిబుగ్గ: వరంగల్‌లోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు గడువులోగా పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను గురువారం ఆమె పరిశీలించారు. భవన నిర్మాణం, మౌలిక వసతులు, విద్యుత్‌ తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీక్ష నిర్వహించారు. ఇందులో సూపరింటెండెంట్‌ రాంకుమార్‌రెడ్డి, ఆర్‌ఎంఓ అశ్విన్‌, ఆర్‌అండ్‌బీ ఈఈ రాజేందర్‌, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ ఆనందం, వరంగల్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌, అధికారులు పాల్గొన్నారు.

క్షేత్రస్థాయిలో భూసర్వే చేపట్టాలి..

ఖిలా వరంగల్‌: భూసర్వేను క్షేత్రస్థాయిలో సమగ్రంగా చేపట్టాలని కలెక్టర్‌ సత్యశారద అధికారులను ఆదేశించారు. గురువారం ఖిలావరంగల్‌ మండలం అల్లీపురంలో భూ రీసర్వే పనులు కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కలెక్టర్‌ వెంట ఏడీ సర్వే అధికారి శ్రీనివాస్‌, తహసీల్దార్‌ ఇక్బాల్‌ ఉన్నారు.

ఆరుతడి సాగును ప్రోత్సహించాలి..

జిల్లాలో ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్‌ సత్యశారద.. వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం వ్యవసాయ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్‌, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్‌రావు, వివిధ మండలాల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement