కుక్క కరిచిన వెంటనే కనీసం 15 నిమిషాల పాటు సబ్బుతో, శుభ్రమైన నీటితో బాగా కడగాలి. తర్వాత యాంటీసెప్టిక్ ద్రావణం ఉపయోగించాలి. మిరియాలు, పసుపు, మూలికలు రాయడం లేదా గాయాన్ని గట్టిగా కట్టడం వంటి పద్ధతులు ఉపయోగించవద్దు. ఇవి రేబిస్‌ను నివారించవు. రేబిస్ ఒక అత్యంత ప్రమాదకర వ్యాధి. లక్షణాలు ప్రారంభమైన తర్వాత దాని మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రేబిస్ పోస్ట్ ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (టీకాలు), టెటనస్ టీకా గురించి సలహా తీసుకోండి. పిల్లలకు అవగాహన కల్పించండి. అపరిచిత కుక్కలను తాకవద్దు, వాటిని వేధించవద్దు, వాటి ముందు పరుగెత్తవద్దు. – డాక్టర్ శ్రీనివాస్, ఆర్‌ఎంఓ, ఎంజీఎం
●


