● ఈనెల 23 నుంచి మే 3వ తేదీ వరకు..
కాజీపేట రూరల్ : వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా ఏప్రిల్, మే నెలల్లో పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు బుధవారం రాత్రి తెలిపారు.
వేసవి ప్రత్యేక రైళ్ల వివరాలు..
ఈనెల 23న చర్లపల్లి–జషిధి (07580) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 28న చర్లపల్లి–ముజఫర్‌పూర్ (07582) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 24న చర్లపల్లి–ముజఫర్‌పూర్ (07584) ఎక్స్‌ప్రెస్, జషిధి–చర్లపల్లి (07581) ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి–ముజఫర్‌పూర్ (07584) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 30న చర్లపల్లి–జషిధి (07586) ఎక్స్‌ప్రెస్, ముజఫర్‌పూర్–చర్లపల్లి (07583) ఎక్స్‌ప్రెస్, ఈ నెల 26న చర్లపల్లి–బరోని (07588) ఎక్స్‌ప్రెస్, ముజఫర్‌పూర్–చర్లపల్లి (07585) ఎక్స్‌ప్రెస్, మే 1వ తేదీన జషిధి–చర్లపల్లి (07587) ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి–ముజఫర్‌ఫూర్ (07590) ఎక్స్‌ప్రెస్, మే 3న ముజఫర్‌పూర్–చర్లపల్లి (07591) ఎక్స్‌ప్రెస్ కాజీపేట జంక్షన్‌కు చేరుకుని వెళ్లనున్నట్లు, ప్రయాణికులు ఈ వేసవి ప్రత్యేక రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెంపపెట్టు
● మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హన్మకొండ: ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీ కుట్రలకు చెంపపెట్టులాంటిందని, బీఆర్‌ఎస్ పార్టీ నిజాయితీకి నిదర్శనమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్ రైతులను ఆగం చేసిందని ఆయన బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఇప్పటికై నా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతుల కోసం పని చేస్తూ సాగునీరు విడుదల చేయాలన్నారు. రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికై నా ముక్కు నేలకు రాసి అన్నదాతలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ నివేదికని బీఆర్‌ఎస్ ముందు నుంచి చెబుతున్న మాట ఈ రోజు అక్షరాలా నిజమని తేలిందన్నారు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయ్యిందన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజీలో స్వల్పంగా దెబ్బతిన్న రెండు పిల్లర్లకు మరమ్మతులు చేసి రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలన్నారు.
కాజీపేట అర్బన్: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ గురుకులాల సంస్థ నిర్వహిస్తున్న సీఓఈ కళాశాలల్లో రెగ్యులర్ గురుకుల జూనియర్ కళాశాలల్లో వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షకు ఈనెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సోషల్ వెల్ఫేర్ కో–ఆర్డినేటర్ ఉమామహేశ్వరి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పరీక్షల్లో హాజరైన ఆసక్తిగల విద్యార్థులు ఈఅవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష మే 13వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.


