ఈజీఎస్‌ లక్ష్యాన్ని పూర్తి చేయండి | - | Sakshi
Sakshi News home page

ఈజీఎస్‌ లక్ష్యాన్ని పూర్తి చేయండి

Apr 16 2026 9:48 AM | Updated on Apr 16 2026 9:48 AM

ఈజీఎస్‌ లక్ష్యాన్ని పూర్తి చేయండి

హన్మకొండ అర్బన్‌: ఉపాధి హామీ పనుల లక్ష్యాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి, ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏప్రిల్‌, మే నెలలకు సంబంధించి ఉపాధి పనుల ప్రగతిపై డీఆర్డీఏ అధికారులు, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలతో సమీక్ష నిర్వహించారు. ఉపాధి పనుల్లో అధిక సంఖ్యలో కూలీలను భాగస్వామ్యం చేసినందుకు ఎర్రబెల్లి గ్రామానికి చెందిన సీనియర్‌ మేట్‌ను కలెక్టర్‌ శాలువాతో సన్మానించి నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. సమావేశంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, డీఆర్డీఏ ఏఓ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓలు, ఏపీఓలు, ఈసీలు తదితరులు పాల్గొన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరించండి

వరంగల్‌ అర్బన్‌: భవన నిర్మాణాల్లో ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌, ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులను హెచ్చరించారు. బుధవారం హనుమకొండ, పలివేల్పుల, మంత్రపూర్‌ కాలనీ, శ్రీనివాసనగర్‌, బాలాజీ నగర్‌ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, ఇంజనీరింగ్‌ పనులు పరిశీలించారు. తనిఖీల్లో ఎంహెచ్‌ఓ రాజేశ్‌, సూపర్‌వైజర్‌ నరేందర్‌, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ బాషానాయక్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు రంజిత్‌, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉన్నత లక్ష్యాలు సాధించాలి..

హన్మకొండ/కాజీపేట అర్బన్‌: బాలసదనంలోని బాలికలు ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు ఇష్టపడి చదవాలని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తెలిపారు. హనుమకొండ సుబేదారిలోని బాలికల బాలసదనాన్ని బుధవారం కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ తనిఖీ చేశారు. కిచెన్‌, ఆహార పదార్థాలను పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి విశ్వజ, సూపరింటెండెంట్‌ ఎం.కళ్యాణి, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్‌చార్జ్‌ ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ ఎం.మౌనిక, కౌన్సిలర్లు త్రివేణి, గౌతమి తదితరులు పాల్గొన్నారు.

హనుమకొండ కలెక్టర్‌

చాహత్‌ బాజ్‌పాయ్‌

అధికారులతో సమీక్ష

Advertisement
 
Advertisement
Advertisement