చెత్త తరలింపును నమోదు చేయాలి
వరంగల్ అర్బన్: చెత్త తరలింపు వాహనాల సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా బాలసముద్రంలో నిర్వహిస్తున్న వెహికల్ షెడ్డును, సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. చెత్త తరలింపు వాహనాల సమాచారంతోపాటు సెకండ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ పరిశీలన బ్రేక్ డౌన్ అయిన వాహనాల సమాచారాన్ని కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో నిర్వహణకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించినట్లు, సమాచారాన్ని యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు.
బయోగ్యాస్ విద్యుత్ ప్లాంట్ పరిశీలన
వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్‌ను మేయర్, కమిషనర్ తనిఖీ చేశారు. సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులకు సూచనలిచ్చారు.
తాగునీటి నాణ్యతా ప్రమాణాల తనిఖీ
తాగునీటి నాణ్యత ప్రమాణాలను పక్కాగా నిర్ధారించి సరఫరా చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ వడ్డేపల్లి ఫిల్టర్‌బెడ్‌ను కమిషనర్ తనిఖీ చేశారు. రా వాటర్, నీటి శుద్ధి ప్రక్రియ, ఫిల్టర్ బెడ్ నిర్వహణ, శుద్ధి నీటి సరఫరా వ్యవస్థలను పరిశీలించారు. నీటి పరీక్ష నిర్వహించి నాణ్యతలు తగిన పరిమాణంలో ఉండడంపై కమిషనర్ సంతప్తి వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో కమిషనర్ వెంట సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈ రాజ్‌కుమార్, శానిటరీ సూపర్‌వైజర్ నరేందర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఏఈ సంతోశ్‌కుమార్, ఐసీసీసీ ఇన్‌చార్జ్ తేజస్వి తదితరులు పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వెహికిల్ షెడ్డు తనిఖీ


