కడిపికొండ బ్రిడ్జి గుంతలమయం
కాజీపేట అర్బన్: హనుమకొండ టు హైదరాబాద్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న కడిపికొండ బ్రిడ్జి అడుగడుగునా గుంతలతో ప్రమాదకరంగా మారింది. ఇటీవల తుపాను ధాటికి బ్రిడ్జిపై గుంతలు ఏర్పడ్డాయి. కాజీపేట మీదుగా ఖమ్మం బైపాస్‌కు అనుసంధానంగా ఉన్న రహదారిపై నిత్యం భారీ వాహనాలతో పాటు కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ప్రయాణం కొనసాగిస్తుంటారు. ఈ క్రమంలో గుంతలతో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ఎంతోమంది విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చాలామంది తీవ్ర గాయాలపాలై క్షతగాత్రులుగా మారి ఆస్పత్రి పాలవుతున్నారు. అయినా వంతెనపై అధికారులు, ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేపట్టడం లేదు.
మరమ్మతులు చేపట్టని అధికారులు
ఇబ్బందులు ఎదుర్కొంటున్న
వాహనదారులు, ప్రయాణికులు
కడిపికొండ బ్రిడ్జి గుంతలమయం
కడిపికొండ బ్రిడ్జి గుంతలమయం


