విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
హన్మకొండ: ఈ రోజుల్లో చదువు ఒక్కటే సరిపోదని, క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి సూచించారు. కాజీపేట మండలం మడికొండలోని నారాయణ పాఠశాలలో జోనల్ స్పోర్ట్స్ మీట్‌ను శనివారం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా జోనల్ డీజీఎం రిజ్వానా ఇమ్రాన్, హనుమకొండ ఎంఈఓ నెహ్రూనాయక్ హాజరుకాగా, ప్రత్యేక అతిథిగా కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. విద్యార్థులు వ్యసనాలకు లోనుకాకుండా చూసే బాధ్యత, వారి ఆసక్తులకు అనుగుణంగా మలిచే బాధ్యత ఉపాద్యాయులపై ఉందని గుర్తుచేశారు. అనంతరం విజేతలకు ఏసీపీ బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తేజావత్ అనిత, అలేఖ్య, ఫర్హాన, మమత, జోనల్ కోఆర్డినేటర్లు ఆకుల సాయికృష్ణ, శ్యామల, శిరీష, అకాడమిక్ డీన్‌లు రాకేష్, విక్రమ్, రాజశేఖర్, వెంకన్న, వీణాకుమారి, సాయిచరణ్, అన్వర్, బందెల వీరస్వామి, రాణి, బాలకృష్ణ పాల్గొన్నారు.


