వైన్స్ ఏర్పాటు చేయొద్దని ఆందోళన
హన్మకొండ: హనుమకొండ అశోక్ కాలనీలో వైన్స్ ఏర్పాటు చేయొద్దని కాలనీవాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వైన్‌షాపు ఏర్పాటు చేసే షట్టర్ల ఎదుట శనివారం ధర్నా చేశారు. మద్యం దుకాణం ఏర్పాటుతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎకై ్సజ్ శాఖ అధికారులు ఇక్కడ వైన్‌షాపు ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని కోరారు. వైన్స్ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తే అడ్డుకుని తీరుతామన్నారు. ధర్నాలో కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మందల కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి బూర రాంచందర్, ఉపాధ్యక్షులు బొద్దిరెడ్డి భగవాన్ రెడ్డి, మల్లేశం, దేవాలయ కమిటీ అధ్యక్షుడు చింత శ్రీనివాస్, కార్యదర్శి సరోత్తంరెడ్డి, కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.


