నేడు విద్యాసదస్సు | - | Sakshi
Sakshi News home page

నేడు విద్యాసదస్సు

Nov 9 2025 7:15 AM | Updated on Nov 9 2025 7:15 AM

నేడు

నేడు విద్యాసదస్సు

నేడు విద్యాసదస్సు కలుషిత తాగునీటి సరఫరా మురుగు నుంచి కాపాడండి ఎమ్మెల్యే శ్రీహరిని కలిసిన ప్రిన్సిపాల్‌ చంద్రమౌళి నెహ్రూ విగ్రహాన్ని పట్టించుకోరూ శివపార్వతుల కల్యాణం

విద్యారణ్యపురి: హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జువాలజీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సంజీవయ్య ఉద్యోగ విరమణను పురస్కరించుకొని వరంగల్‌ అధ్యాపక మిత్రుల ఆధ్వర్యంలో విద్యాసదస్సును ఆదివారం నిర్వహించనున్నారు. కొత్తూరు వెల్‌నెస్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న డైమండ్‌ హిల్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరగనున్న సదస్సులో సామాజిక సంక్షోభం – అధ్యాపకుల పాత్ర అనే అంశంపై వీక్షణం ఎడిటర్‌ ఎన్‌.వేణుగోపాల్‌, బోధనా వృత్తి సంక్షోభం – కొన్ని ఆలోచనలు అనే అంశంపై మైసూర్‌ ఆర్‌ఐఈ ప్రొఫెసర్‌ డాక్టర్‌ బుర్రా రమేష్‌ ప్రసంగించనున్నారని నిర్వాహకులు తెలిపారు.

కాజీపేట: కాజీపేట పట్టణంలోని పలు కాలనీలకు నల్లాల ద్వారా కలుషితమై, రంగుమారిన తాగునీరు వస్తున్నా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం మండల కార్యదర్శి ఓరుగంటి సాంబయ్య విమర్శించారు. ఫాతిమానగర్‌, సిద్ధార్థనగర్‌, ప్రశాంత్‌నగర్‌ కాలనీల్లో నాయకులు బృందం పర్యటించి కలుషిత నీటిని శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు స్పందించి కలుషిత నీటి సరఫరాను నిలిపివేయాలని సూచించారు. కార్యక్రమంలో జంపాల రమేష్‌, తిక్క సాంబయ్య, జక్కుల స్వామి, యాద సునీత, రేఖ పాల్గొన్నారు.

నయీంనగర్‌: గ్రేటర్‌ వరంగల్‌ 62వ డివిజన్‌లో డ్రెయినేజీ, మురుగుతో పేరుకుపోతున్న రెండెకరాల మురుగు కుంట నుంచి కాపాడాలని రహమత్‌నగర్‌ కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. హనుమకొండ ప్రెస్‌ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో కాలనీవాసులు బాబుమియా, రఘు మాట్లాడుతూ మురుగు నీటితో భూగర్భ జలాలు కలుషితమై కాలనీవాసులు అనేక రోగాలపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. సమావేశంలో హైదర్‌, రహమత్‌, కవిత, సిరాజ్‌, రాంబాబు, దిల్‌షాద్‌, రజాక్‌, సత్తార్‌, స్వరూప, ముంతాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యారణ్యపురి: జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండల కేంద్రంలో ఈవిద్యా సంవత్సరంలో నూతనంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేశారు. ఆ కళాశాలకు హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్‌ పీజీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చంద్రమౌళికి ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌ (ఎఫ్‌ఏసీ) అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు హనుమకొండలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ చంద్రమౌళి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కడియంను కలిసిన వారిలో పింగిళి డిగ్రీ కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుహాసిని, రిటైర్డ్‌ అధ్యాపకుడు డాక్టర్‌ సారంగపాణి, తదితరులు ఉన్నారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్‌ లోకోషెడ్‌ కాలనీలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ విగ్రహాన్ని పట్టించుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు రైల్వే ఏడీఈఎన్‌ సంతోష్‌కుమార్‌ రాజ్‌ను శనివారం కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఇప్ప శ్రీకాంత్‌, మైసారపు సిరిల్‌లారెన్స్‌ తెలిపారు. నవంబర్‌ 14 చిల్డ్రన్స్‌డే సందర్భంగా నెహ్రూ విగ్రహం చుట్టూ ఉన్న పిచ్చిమొక్కలను తొలగించాలని, విగ్రహానికి రంగులు వేయించాలని కోరారు. కార్యక్రమంలో నీలం భానుచందర్‌, వెంపటి నాగమహేష్‌, సిలువేరు మల్లికార్జున్‌, ఇమ్మడి రవి, ఎండి.అలీం, కాళేశ్వరం వంశీ, గోనెల అనిల్‌కుమార్‌ పాల్గొన్నారు.

కాజీపేట: 63వ డివిజన్‌ జూబ్లీ మార్కెట్‌ ఆవరణలోని అభయాంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో శనివారం రాత్రి పార్వతీ పరమేశ్వరుల కల్యాణ వేడుకలను కనులపండువగా నిర్వహించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వాహకుడు జాగర్లపూడి శ్రీనివాస్‌ శర్మ ఆధ్వర్యంలో ఆది దేవుడి వివాహాన్ని అర్చకులు జరిపించారు.

నేడు విద్యాసదస్సు
1
1/3

నేడు విద్యాసదస్సు

నేడు విద్యాసదస్సు
2
2/3

నేడు విద్యాసదస్సు

నేడు విద్యాసదస్సు
3
3/3

నేడు విద్యాసదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement