విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
ఖిలా వరంగల్: వైద్య అధికారులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని వరంగల్ డీఎంహెచ్‌ఓ బి.సాంబశివరావు హెచ్చరించారు. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్, అల్లీపురం గ్రామాల్లో శనివారం ఆయన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని పరిశీలించి మాట్లాడారు. వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను విజయవంతం చేయాలని ఆదేశించారు. ప్రతిరోజు చేసే సర్వే రిపోర్టులను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు.


