కార్తీక వనభోజనం.. ఆత్మీయ సమ్మేళనం
న్యూస్‌రీల్
ఆదివారం శ్రీ 9 శ్రీ నవంబర్ శ్రీ 2025
ప్రకృతితో విడదీయలేని బంధం మానవాళిది. కార్తీక మాసంలో ఒక రోజు పచ్చని చెట్ల నడుమ స్వచ్ఛమైన గాలి పీల్చుతున్నారు. కష్టసుఖాలు పంచుకుని సామూహిక భోజనాలు చేసి ఆడిపాడుతున్నారు. వనసమారాధన చేసి దైవ చింతనలో లీనమవుతున్నారు. అనాదిగా వస్తున్న వన భోజనాల సంప్రదాయాన్ని గ్రామాల్లో అయితే సమష్టిగా జరుపుకునేవారు. పట్టణాల్లో ప్రస్తుతం అది రూపాంతరం చెందింది. కుల సంఘాలు, కాలనీల వారీగా వన భోజనాలకు వెళ్తున్నారు. జీవిత బంధాల్ని బలోపేతం చేసే ఈ వేడుకపై ‘సాక్షి’ సండే స్పెషల్. – కాజీపేట
కార్తీక మాసంలో దేవతలు వనాల్లో విహరిస్తూ చెట్లపై కొలువుదీరుతారని ప్రజల నమ్మకం. ఎన్నో ఔషధ గుణాలున్న ఉసిరి చెట్టును శ్రీమహావిష్ణువుగా భావించి దానికింద భోజనం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు. అడవులు అంతరించి పోతున్న నేపథ్యంలో ఏదో ఒక చెట్టు కింద వన భోజనాలు చేసి సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నెల 20వ తేదీ వరకు కార్తీక మాసం ఉండడంతో వచ్చే రెండు వారాంతాల్లో పెద్ద ఎత్తున వనభోజనాలకు ప్లాన్ చేసుకున్నారు.
ఆధ్యాత్మిక చింతన..
కార్తీక మాసంలో అనాదిగా వస్తున్న వన భోజనాల సంప్రదాయం ఆధ్యాత్మిక చింతనతోపాటు హైందవ ధర్మాన్ని చాటి చెబుతోంది. వనసమారాధన వల్ల ఆయుర్వేదంలో వృక్ష జాతికున్న విశిష్టత అందరికీ తెలుస్తోంది. వండిన ఆహారాన్ని మహావిష్ణువుకు ప్రీతికరమైన ఉసిరి చెట్టు కింద తింటే మంచి ప్రతిఫలం ఉంటుంది. దీక్షలు తీసుకున్న స్వాములు భక్తి భావంతో వనభోజనాలకు వెళ్తుండడం పరిపాటిగా మారింది. కాగా.. ప్రస్తుతం వనభోజనాలకు బదులు కొందరు ఉద్యానవనాల్లో పిక్నిక్‌లకు, నదులు, సముద్రతీరాల్లో భోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మామిడి తోటలు అందుబాటులో ఉన్న ప్రాంతాల వారు ఆయా ప్రదేశాల్లో వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. నేడు (ఆదివారం) హనుమ కొండ జిల్లా పరిధిలోని పద్మశాలీలు హసన్‌పర్తి ఎర్రగట్టు వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. వచ్చే ఆదివారం విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ కులస్తులు దూపకుంటలో వనభోజనా లకు వెళ్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో వారాంతాల్లో వనభోజనాలకు వెళ్తున్నారు.
అనాదిగా సంప్రదాయం
ఒకప్పుడు గ్రామాల్లో వన భోజనాలకు వెళ్లేవారు. వన సమారాధన చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొనేవారు. ఎక్కాహం, సప్తాహం పేరిట భజనలు, భక్తిభావంలో మునిగిపోయేవారు. పచ్చటి వనాల నడుమ కమ్మటి భోజనాన్ని ఆరగించేవారు. కష్టసుఖాలు పంచుకునేవారు. ఆధునిక యుగంలో ఎవరి బిజీ వారిది. అయినా కార్తీక మాసంలో ఈ సంప్రదాయాన్ని కులసంఘాలు, కాలనీల పెద్దలు భుజాన వేసుకుంటున్నారు. అడవులు అంతరించి పోతుండడంతో దగ్గరలోని వనాల నడుమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆడిపాడి సందడి చేస్తున్నారు.
ఉసిరి చెట్టుకు పూజలు చేస్తున్న భక్తులు (ఫైల్)
పవిత్ర మాసంలో
ఇది సత్సంప్రదాయం..
కుల సంఘాల వారీగా
వన భోజనాలు
అనుబంధాలు, బంధుత్వాలు పటిష్టం
ఆచారాన్ని కొనసాగిస్తున్న
ఉమ్మడి జిల్లావాసులు
పెళ్లి చూపుల వేదికగా...
ప్రస్తుతం వన భోజనాలు పెళ్లి చూపులకు వేదికలుగా కూడా మారుతున్నాయి. తమ పిల్లలకు మంచి సంబంధాలు వెతకాలంటే వనభోజ నాలకు హాజరై ఇరు కుటుంబాల వారు మాట, మంచి పంచుకుంటున్నారు. ఆయా కుటుంబాలు కలిసి మాట్లాడుకోవడం, ఒకరి నొకరు చూసుకునే తతంగమంతా వనభోజనాల్లోనే పూర్తవుతోంది. నచ్చితే ఆ తర్వాత కొనసాగింపు ఉంటుంది.
కార్తీక వనభోజనం.. ఆత్మీయ సమ్మేళనం
కార్తీక వనభోజనం.. ఆత్మీయ సమ్మేళనం
కార్తీక వనభోజనం.. ఆత్మీయ సమ్మేళనం
కార్తీక వనభోజనం.. ఆత్మీయ సమ్మేళనం


