పరమశివుడే ఒక జ్యోతి
హన్మకొండ కల్చరల్: కార్తీక మాసంలో పరమశివుడే ఒక జ్యోతిలా వెలుగొందుతాడని వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు. వేయిస్తంభాల ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం 6 గంటలకు మహా లింగార్చన నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితుడు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ, ప్రణవ్ ఉదయం నిత్యాహ్నికం నిర్వహించి రుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. భక్తులు సతీశ్‌కుమార్ దంపతుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం జరిగిన కార్తీకసమారాధనలో వందలాది మంది భక్తులు భోజన ప్రసాదం స్వీకరించారు. సాయంత్రం సంకటహర చతుర్థిని పురస్కరించుకుని ఉత్తిష్టగణపతికి పంచామృతాభిషేకం, నవరసాభిషేకం నిర్వహించి గరికపూజ చేశారు. అనంతరం 11 మంది వేద పండితుల ఆధ్వర్యంలో పుట్టమట్టితో తయారు చేసిన లింగాలను మహా శివలింగాకారంలో అమర్చి పంచామృతాభిషేకం, పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి మహాలింగార్చన చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు జ్యోషిభరత్‌శర్మ, ప్రసాద్‌శర్మ, రిషిశర్మ, అశ్రిత్, కృష్ణ, ప్రద్యుమ్నశర్మ తదితరులు పాల్గొన్నారు. ఆల య ఈఓ అనిల్‌కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు.


