పాఠశాలల క్రీడలకు నిధుల మంజూరు
విద్యారణ్యపురి: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఈ విద్యాసంవత్సరం (2025–2026)నకు సంబంధించి క్రీడలు, శారీరక విద్యకు నిధులు మంజూరయ్యాయి. తొలుత 50శాతం విడుదల చేశారు. మిగతావి తర్వాత విడుదల చేయనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాల్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలకు ఈ నిధులు మంజూరయ్యాయి.
నిధుల విడుదల ఇలా..
జిల్లాలవారీగా పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీలకు (ఎస్‌ఎంసీఎస్ /ఏఏపీఎస్) నిధులు విడుదల చేశారు. పీఎస్‌లు, యూపీఎస్‌లు, హైస్కూళ్లకు ఇచ్చారు. విద్యార్థులు లేని పాఠశాలలు, పీఎంశ్రీ పాఠశాలలకు ఈ నిధుల మంజూరు లేదు. ప్రస్తుతం విడుదల చేసిన నిధులను విద్యార్థుల క్రీడలు, ఫిజికల్ ఎడ్యుకేషన్‌కింద వినియోగించుకోవాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ మెటీరియల్, క్రీడల నిర్వహణకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఒక్కో పీఎస్‌కు రూ.5వేలు, యూపీఎస్‌కు రూ.10వేలు హైస్కూ ల్‌కు రూ.25 వేల చొప్పున కేటాయిస్తారు.
జిల్లాల వారీగా నిధులు మంజూరు, విడుదల ఇలా (రూ.లక్షల్లో)
జిల్లా పాఠశాలలు మంజూరు విడుదల
హనుమకొండ 342 42.30 21.15
వరంగల్ 385 45.60 22.80
జనగామ 361 42.45 21.23
మహబూబాబాద్ 536 50.75 25.38
ములుగు 312 26.35 13.18
భూపాలపల్లి 325 33 16.50
తొలుత 50 శాతం విడుదల


