ప్రొఫెసర్ నర్సింహారెడ్డికి ఐపీజీఏ ఫెల్లోషిప్ అవార్డు
కేయూ క్యాంపస్: ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ (ఐపీజీఏ) ఫెల్లోషిప్–2025 అవార్డును కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల ప్రొఫెసర్ వై.నర్సింహారెడ్డి అందుకున్నారు. శనివారం లక్నోలోని బా బాసాహెబ్ భీంరావు అంబేడ్కర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఇండియన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ 37వ వార్షిక సమావేశంలో ఆయనకు అవార్డు అందజేశారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజీవ్‌సింగ్ రఘువంశి, ఐపీజీఏ అధ్యక్షుడు అటుల్‌నాసా, జనరల్ సెక్రటరీ అరుణ్‌గార్గ్ చేతుల మీదుగా నర్సింహారెడ్డికి అవార్డు ప్రదానం చేశారు. ఈసందర్భంగా నర్సింహారెడ్డికి శాలువా కప్పి సన్మానించి జ్ఞాపికను, సర్టిఫికెట్ అందజేశారు. ఫార్మసీ రంగంలో విశిష్ట సేవలందించినందుకు ఐపీజీఏ సభ్యులకు నిర్దిష్ట ప్రమాణాలతో ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డు అందజేశారు.
కేయూ క్యాంపస్: భోపాల్‌లోని ఎస్‌ఏజీఈ యూనివర్సిటీలో ఈనెల 10, 11 తేదీల్లో నిర్వహించనున్న సౌత్‌జోన్ ఇంటర్ వర్సిటీ జూడో టోర్నమెంట్‌కు కేయూ జూడో ఉమెన్స్ జట్టును ఎంపిక చేసినట్లు శనివారం కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ ఆచార్య వై.వెంకయ్య తెలిపారు. ఈ జట్టులో కె.అనూష, డి.నక్షత్ర (టీజీఎస్‌డబ్ల్యూఆర్డీసీ, వరంగల్ వెస్ట్), ఎస్.శ్రీచందన (వరంగల్ కిట్స్), డి.బేబీలాహా, టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ (వరంగల్ వెస్ట్) సీహెచ్.శైలజ (టీజీటీడబ్ల్యూ ఆర్‌డీసీ, కొత్తగూడెం), ఎన్.సాయిశ్రీ (తాళ్ల పద్మావతి ఫార్మసీ కాలేజీ) ఉన్నారు. ఈజూడో జట్టుకు వరంగల్ వెస్ట్ టీజీటీడబ్ల్యూ ఆర్డీసీ (ఉమెన్స్) ఫిజికల్ డైరెక్టర్ బి.మౌనిక కోచ్ కమ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారని స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ వెంకయ్య తెలిపారు.
ఖిలా వరంగల్: కాకతీయుల నిర్మాణ శైలి, శిల్ప కళా సంపద వెరీ బ్యూటిఫుల్ అని నెదర్లాండ్ అమెరికా దేశస్తులు జోహన్, హెలెన్, మోనికా కొనియాడారు. చారిత్రక ప్రసిద్ధి చెందిన ఖిలా వరంగల్ మధ్యకోటను నెదర్లాండ్, అమెరికా దేశస్తులు శనివారం సందర్శించారు. ఈసందర్భంగా నాలుగు కాకతీయ కీర్తితోరణాల నడుమ ఉన్న నళ్లరాతితో చెక్కిన అద్భుత శిల్ప కళా ఖండాలను విదేశీయులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం రాతి, మట్టికోట అందాలతోపాటు ఏకశిల చిల్డ్రెన్స్ పార్కు, ఏకశిల గుట్ట, ఖుష్‌మాహల్‌ను సందర్శించి కాకతీయ కట్టడాలు, శిల్ప కళా సంపదను ఆసక్తిగా చూశారు. కాకతీయుల విశిష్టత, చారిత్రక కట్టడాల గురించి కోట గైడ్ రవియాదవ్ వివరించారు. వారి వెంట కేంద్ర పురావస్తుశాఖ కో–ఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీటీడీసీ కో–ఆర్డినేటర్ గట్టికొప్పుల అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎంజీఎం: సర్జన్స్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ 11వ వార్సికోత్సవ సమావేశం వరంగల్ కేఎంసీలో రెండో రోజు శనివారం ఘనంగా జరిగింది. ఈసమావేశానికి ముఖ్య అతిథులుగా కాళోజీ వర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ నందకుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ సంధ్యారాణి, జీఎంసీ ప్రిన్సిపాల్ మోహన్‌దాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సమాజ సేవకు సర్జికల్ అసోసియేషన్ అంకితమవ్వాలని సూచనలిచ్చారు. కార్యక్రమంలో వైద్యులు కూరపాటి రమేశ్, నాగేందర్, శ్రీనివాస్ గౌడ్, ఉమాకాంత్‌గౌడ్, నరేశ్‌కుమార్, అప్పాల సుధాకర్, సిద్ధార్థ్, రాజ్యలక్ష్మి, గోదాదేవి, గోపాల్ రావు, ఎన్‌వీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ నర్సింహారెడ్డికి ఐపీజీఏ ఫెల్లోషిప్ అవార్డు


