
నేడు ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండలోని డీఎస్‌ఏ బాక్సింగ్ హాల్‌లో గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు హనుమకొండ, వరంగల్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణ కార్యదర్శి పి. రాజేందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు జనవరి 01, 2011 నుంచి డిసెంబర్ 31, 2012 తేదీలోపు జన్మించి ఉండాలన్నారు. క్రీడాకారులు తమ ఆధార్, పాఠశాల స్టడీ సర్టిఫికెట్, మున్సిపల్ ధ్రువీకరించిన జనన ధ్రువీకరణ పత్రం, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఉదయం 7.30 గంటలకు బాక్సింగ్‌హాల్ వద్ద రిపోర్టు చేయాలని సూచించారు. ఇందులో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఇతర వివరాలకు 99597 11609 నంబర్‌లో సంప్రదించాలని పేర్కొన్నారు.
విద్యుత్ ఎస్సీ, ఎస్టీ
ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా దానయ్య
హన్మకొండ: తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బక్క దానయ్య ఎన్నికయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య భవన్‌లో అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో హనుమకొండ జిల్లా హనుమకొండ రూరల్ సబ్ డివిజన్ ఏడీఈ బక్క దానయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన మాట్లాడుతూ తనను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విద్యుత్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, సహకరించిన అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై బుధవారం హనుమకొండకు చేరుకున్న బక్క దానయ్యకు ఆ అసోసియేషన్ నాయకులు రౌతు రమేశ్ కుమార్, స్వదేశ్, చలపతి, కు మారస్వామి, కృష్ణ, కుమారస్వామి, రాజయ్య, జడల రవి, తదితరులు స్వాగతం పలికారు.
రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయం
హన్మకొండ అర్బన్: రక్తదాన కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న రెడ్‌క్రాస్ సేవలు అభినందనీయమని హనుమకొండ కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు స్నేహ శబరీష్ కొనియాడారు. సుబేదారిలోని రెడ్‌క్రాస్ సొసైటీలోని జనరిక్ మందుల షాప్, టైలరింగ్ శిక్షణ కేంద్రం, తలసేమియా సెంటర్‌ను బుధవారం సందర్శించి పిల్లలతో మాట్లాడి వారి బాగోగులు తెలుసుకున్నారు. తలసేమియా బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రధాన మంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 30 మంది టీబీ వ్యాధిగ్రస్తులకు న్యూట్రిషన్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రెడ్‌క్రాస్ అభివృద్ధి తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటుందని తెలిపారు. రెడ్ క్రాస్ పాలకవర్గ సభ్యులు కలెక్టర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ విజయచందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ పాపిరెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు శ్రీనివాస్‌రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు వేణుగోపాల్, శేషుమాధవ్, శ్రీనివాస్‌రావు, సుధాకర్‌రెడ్డి, జయశ్రీ, రమణారెడ్డి, హనుమకొండ డీఎంహెచ్‌ఓ అప్పయ్య, జిల్లా టీబీ నివారణాధి కారి డాక్టర్ హిమబిందు, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.

నేడు ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు

నేడు ఉమ్మడి జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు