
మీనాక్షి నటరాజన్‌ను కలిసిన ఎమ్మెల్యే నాయిని
హన్మకొండ చౌరస్తా: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్‌లను హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు, వరంగల్ పశ్చిమ ఎమ్మె ల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మంగళవారం హైదరా బాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, పదవుల కేటా యింపు తదితర అంశాలపై నటరాజన్‌కు వివరించారు.
డిగ్రీ ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో నూతన పాఠ్యపుస్తకం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో ఈ విద్యాసంవత్సరం (2025–2026 )నుంచి నూతన పాఠ్యపుస్తకం తీసుకురానున్నట్లు ఆ విభాగం బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ పి. నిర్మల తెలిపారు. మొదటి సంవత్సరంలో ఇంగ్లిష్ ఫర్ బ్రిలియన్స్ పాఠ్య పుస్తకం ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు మంగళవారం కేయూలోని ఇంగ్లిష్ విభాగంలో బోర్డు ఆఫ్ స్డడీస్ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కొత్త సిలబస్‌లో గద్యభాగం, కవిత్వం, నటన, నాటకం, వ్యాకరణం, లెర్నింగ్ స్టడీ, రీడింగ్, రైటింగ్ నైపుణ్యాల అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటాయని వివరించారు. ఈ నూతన పాఠ్యపుస్తకాలు వారం రోజుల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో ఆ విభాగం అధిపతి డాక్టర్ ఆర్. మేఘనరావు, బోర్డు ఆఫ్ స్టడీస్ సభ్యులు ఎం.నవీన్, శ్రీనాథ్, రాంభాస్కరరాజు, హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ ఫారిన్‌లాంగ్వెజెస్ యూనివర్సిటీకి చెందిన ఎక్స్‌టర్నల్ మెంబర్ ప్రొఫెసర్ శారద పాల్గొన్నారు.
పలు రైళ్లు రద్దు.. రీషెడ్యూల్
కాజీపేట రూరల్ : సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్‌లో రీమోడలింగ్ పనుల నేపథ్యంలో కాజీపేట జంక్షన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
రద్దయిన రైళ్ల వివరాలు..
ఆగస్టు 30వ తేదీన చర్లపల్లి–రక్సోల్ (07051) ఎక్స్‌ప్రెస్, ఆగస్టు 31న రక్సోల్–హైదరాబాద్ (17006) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 1వ తేదీన చర్లపల్లి–రక్సోల్ (07005) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 2వ తేదీన రక్సోల్–చర్లపల్లి (07052), సెప్టెంబర్ 4వ తేదీన రక్సోల్–చర్లపల్లి (07006) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 8వ తేదీన హెచ్.ఎస్.నాందేడ్–సంత్రగచ్చి (12767) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 9వ తేదీన చర్లపల్లి–దర్బాంగా (17007) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 10వ తేదీన సంత్రగచ్చి–హెచ్.ఎస్.నాందేడ్ (12768) ఎక్స్‌ప్రెస్, సెప్టెంబర్ 12వ తేదీన దర్బాంగా–చర్లపల్లి (17008) ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు తెలిపారు.
పలు రైళ్లు రీషెడ్యూల్
కాజీపేట జంక్షన్ మీదుగా ఆగస్టు 30వ తేదీన తాంబరం–జషిధి (12375) ఎక్స్‌ప్రెస్ 6 గంటలు, సెప్టెంబర్ 1,8వ తేదీల్లో శ్రీమాత వైష్ణవి టెంపుల్ బెంగళూరు–టాటానగర్ (12890) ఎక్స్‌ప్రెస్ 5 గంటలు, సెప్టెంబర్ 9వ తేదీన శ్రీ మాతవైష్ణవి టెంపుల్ బెంగళూరు–హతియ (12836) ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్‌తో నడిపించనున్నట్లు సీపీఆర్వో తెలిపారు.
‘కుల్పా’ అధ్యక్షుడిగా
నాగేశ్వర్‌రావు
కేయూ క్యాంపస్: కాకతీయ యూ నివర్సిటీ లైబ్రరీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (కుల్పా) అధ్యక్షుడిగా డాక్టర్ ఎ.నాగేశ్వర్‌రావును ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాకతీయ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన కుల్పా సర్వసభ్య సమావేశంలో ఎన్నుకున్నారు. గ్రంథపాలకుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న లైబ్రరీ సైన్స్‌లో అత్యధిక మార్కులు పొందిన విద్యార్థికి బంగారు పతకం, ఉత్తమ లైబ్రేరియన్ పురస్కారం, ఉత్త మ విద్యార్థికి మెమెంటో అందించాలని సమావేశం తీర్మానించినట్లు కుల్పా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణమాచార్య తెలిపారు. సమావేశంలో కోశాధికారి ఎం. మనోహర్‌రావు, ప్రొఫెసర్ కె.రమణయ్య, ఎం.కోటేశ్వర్ పాల్గొన్నారు.

మీనాక్షి నటరాజన్‌ను కలిసిన ఎమ్మెల్యే నాయిని

మీనాక్షి నటరాజన్‌ను కలిసిన ఎమ్మెల్యే నాయిని