
కేయూలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్
కేయూ క్యాంపస్: విద్యార్థులు, టీచర్లు, యువతలో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలనే ఉద్దేశంతో తెలంగాణ అకాడమీ సైన్సెస్, కాకతీయ యూనివర్సిటీ సంయుక్తంగా కాకతీయ యూనివర్సిటీలో ఆగస్టు 19, 20, 21 తేదీల్లో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటై ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీతో 50 సంవత్సరాలు పూర్తికాబోతున్నాయి. దీంతో యూ నివర్సిటీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ఈ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబోతున్నారు. అందుకు అధికారులు కమిటీలను నియమించి సమావేశం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సైన్స్ కాంగ్రెస్ ‘ఇన్నోవేటివ్ స్కిల్స్ ఫర్ ఎంపవర్‌మెంట్, సైన్స్ అండ్ టె క్నాలజీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ అనే అంశంపై కొనసాగనుంది. అంతేకాకుండా మరో ఏడు థీమ్స్‌లోనూ ప్లీనరీ సెషన్స్ జరగనున్నాయి. ఫిజిక ల్ అండ్ మ్యాథమెటికల్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కెమికల్ సైన్సెస్, లైఫ్‌సైన్స్ అండ్ అగ్రికల్చరల్ సైన్సెస్, మెడికల్ హెల్త్ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, ఎర్త్ ఓసియన్ అట్మాస్పియర్,ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్‌లోనూ ప్లీనరీ సెషన్స్ ఉంటాయి.
ఇప్పటి వరకు 400 వరకు అబ్‌స్ట్రాక్ట్స్..
రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు, పరిశోధకులు తదితరులు సైన్స్ కాంగ్రెస్‌లో తమ పరిశోధన పత్రాలు సమర్పించేందుకు 400 వరకు అబ్‌స్ట్రాక్ట్స్ వచ్చాయి. 150 వరకు రిజిస్ట్రేషన్స్ అయ్యాయి.రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆగస్టు 3వ తేదీ వరకు గడువు ఉంది.
విద్యార్థులు, టీచర్లతో సైంటిస్టుల ఇంటారాక్షన్
సైన్స్ కాంగ్రెస్‌లో విద్యార్థులు, టీచర్లతో ప్రముఖ సైంటిస్టుల ఇంటరాక్షన్ కూడా ఉంటుంది. ప్రస్తుతం సీసీఎంబీ మాజీ డైరెక్టర్ సీహెచ్. మోహన్‌రావు, డీఆర్‌డీఓ రిటైర్డ్ సైంటిస్ట్ మార్తా ఎన్‌రెడ్డి, వరంగల్ నిట్ రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎ. రామచంద్రయ్య, డీఆర్‌డీఓ మాజీ డైరెక్టర్ ఎన్. ఈశ్వరప్రసాద్‌తో ఇంటారాక్షన్ ఉంటుంది.
ప్లీనరీ సెషన్ –1లో..
తొలిరోజు ప్లీనరీ సెషన్– 1లో హైదరాబాద్ సీసీఎంబీ డైరెక్టర్ కె. నందికూరి, బెంగుళూరులోని డీఆర్‌డీఓ ఎల్‌ఆర్‌డీఈ డైరెక్టర్ జి విశ్వమ్ వివిధ అంశాలపై లెక్చర్స్ ఉంటాయి. ఇలా మూడు రోజుల పాటు దేశంలోని వివిధ సంస్థల నుంచి అనేక మంది సైంటిస్టులతో ప్లీనరీ సెషన్‌లు ఉంటాయి.
విద్యార్థుల ఎగ్జిబిట్లకు అవకాశం..
సైన్స్‌లో వివిధ విభాగాల్లో పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఎగ్జిబిట్లను ప్రదర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఇన్‌స్పైర్, సైన్స్‌ఫెయిర్ మాదిరి తమ ఎగ్జిబిట్లను తీసుకొస్తే ఏ విభాగానికి సంబంధించినది అయితే ఆ విభాగంలో జరిగే సెషన్లలో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. అందుకే హైస్కూల్ స్థాయి విద్యార్థులు కూడా దీనిని వినియోగించుకునేలా సైన్స్ టీచర్లు సహకరించాల్సి ఉంటుంది.
మళ్లీ కేయూలోనే సైన్స్ కాంగ్రెస్ నిర్వహణ ..
తెలంగాణ సైన్స్ కాంగ్రెస్ 2018లో వరంగల్ నిట్‌లో నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ రెండో సైన్స్ కాంగ్రెస్ కూడా వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలోనే నిర్వహించబోతున్నారు. అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ కమిటీలను కూడా నియమించారు
విద్యార్థులు, టీచర్లకు రిజిస్ట్రేషన్ లేకుండానే పాల్గొనే అవకాశం..
యూనివర్సిటీల కళాశాలల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులకే కాకుండా హైస్కూల్ స్థాయి విద్యార్థులు, టీచర్లు కూడా తెలంగాణ సైన్స్ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు సైన్స్ కాంగ్రెస్ లోకల్ సెక్రటరీ, కేయూ ఫిజిక్స్ విభాగం ప్రొఫెసర్ బి. వెంకట్రామ్‌రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సైన్స్ అధికారులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు. సైన్స్ టీచర్లు.. 9,10వ తరగతుల విద్యార్థులను ఈ సైన్స్ కాంగ్రెస్‌కు తీసుకురావాలని కోరారు.
ఆగస్టు 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహణ
ఇప్పటికే 400 వరకు పరిశోధన పత్రాల అబ్‌స్ట్రాక్ట్స్
ఆగస్టు 3 వరకు రిజిస్ట్రేషన్‌కు
అవకాశం
శాసీ్త్రయ దృక్పథం పెంపొందించడమే సదస్సు ఉద్దేశం
ఆగస్టు 3 వరకు గడువు..
కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరగబోయే తెలంగాణ సైన్స్‌కాంగ్రెస్‌కు 500 వరకు ప్రతినిధులు వచ్చేఅవకాశం ఉంది. ఆసక్తి గల వారు వివిధ విభాగాలకు సంబంధించిన వారు తమ పరిశోధనపత్రాల సమర్పణకు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు గడువు ఆగస్టు 3 వరకు ఉంది.
–ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డి,
లోకల్ సెక్రటరీ,తెలంగాణ సైన్స్ కాంగ్రెస్

కేయూలో తెలంగాణ సైన్స్ కాంగ్రెస్