బ్రోకర్ల బోగస్‌ దందా.. | - | Sakshi
Sakshi News home page

బ్రోకర్ల బోగస్‌ దందా..

Jul 30 2025 6:37 AM | Updated on Jul 30 2025 6:37 AM

బ్రోకర్ల బోగస్‌ దందా..

బ్రోకర్ల బోగస్‌ దందా..

హసన్‌పర్తి : రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌ కోసం వాహనదారులను లూఠీ చేస్తున్న బ్రోకర్లు మరో దందాకు తెరలేపారు. బోగస్‌ రిజిస్ట్రేషన్‌తోపాటు ఇన్సూరెన్స్‌ పత్రాలను తయారు చేసి వాటితో వాహన రిజిస్ట్రేషన్‌, ఫిట్‌నెస్‌ చేయిస్తున్న రెండు వేర్వేరు ముఠాలను టాస్క్‌ఫోర్స్‌, హనుమకొండ, కేయూసీ, మిల్స్‌ కాలనీ పోలీసులతో పాటు ఆర్‌టీఏ అధికారులు పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను సెంట్రల్‌ జోన్‌ డీసీపీ షేక్‌ సలీమా మంగళవారం విలేకరులకు వెల్లడించారు. హనుమకొండకు చెందిన ఆసిఫ్‌ ఖురేషి, వడ్లకొండ శ్రీనివాస్‌, లేబర్‌కాలనీకి చెందిన ఎం.డి.నవాబ్‌, ఎల్‌.బీనగర్‌కు చెందిన సాబీర్‌, నయీంనగర్‌కు చెందిన మణికంఠ ప్రభాకర్‌రెడ్డి, కాపువాడకు చెందిన గుగ్గిళ్ల చెర్రిబాబు, హనుమకొండ గుడిబండల్‌కు చెందిన కేశోజు రాజ్‌కుమార్‌ అలియాస్‌ డి.ఎల్‌.రాజు, ధర్మసాగర్‌ మండలం కరుణాపురానికి చెందిన ఎం.డి ఆసిఫ్‌, ధర్మసాగర్‌కు చెందిన అంకం శ్రీనివాస్‌, హనుమకొండ సుధానగర్‌కు చెందిన గోనెల రమేశ్‌ అలియాస్‌ వాగ్దేవి రమేశ్‌, ఫోర్ట్‌ వరంగల్‌కు చెందిన ఎన్‌. శశివర్ధన్‌, కరీమాబాద్‌కు చెందిన నరిశెట్టి రాజేశ్‌, గీసుకొండ మండలం శాయంపేట హవేలికి చెందిన దిలీప్‌కుమార్‌, నక్కలపల్లికి చెందిన ముజ్జిగ ఓంప్రకాశ్‌, ఫాతిమానగర్‌కు చెందిన ముసిపట్ల అక్షయ్‌కుమార్‌.. ఆర్‌టీఏ బ్రోకర్లు, కన్సల్టెన్సీలుగా వ్యవహరిస్తున్నారు. సతీశ్‌, వేల్పుల ప్రశాంత్‌, దేవులపల్లి శ్రవణ్‌, మామిడి రాజు అలియాస్‌ భూపాలపల్లి రాజు, లక్ష్మయ్య పరారీలో ఉన్నారని డీసీపీ తెలిపారు.

ఫైనాన్స్‌ సంస్థల నుంచి

వాహనాలు కన్సల్టెన్సీలకు..

ఫైనాన్స్‌పై వాహనాలు కొనుగోలు చేసిన వారు ఆర్థిక కారణాలతో వాయిదాల డబ్బులు చెల్లించని పక్షంలో ఆ వాహనాలు ఫైనాన్స్‌ సంస్థలు స్వాధీనం చేసుకుని తిరిగి వాటిని విక్రయించాలంటే ఆన్‌లైన్‌లో ఆర్‌టీఏకు మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఫైనాన్స్‌ సంస్థలు అలా చేయకుండా వాహన కన్సల్టెన్సీలకు విక్రయించేవి. ఈ సమయంలో వారికి నో అబ్జెక్షన్‌తో సర్టిఫికెట్‌తో పాటు ఒరిజినల్‌ వాహన రిజిస్ట్రేషన్‌ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఫైనాన్స్‌ సంస్థలు నేరుగా కన్సల్టెన్సీలకు వాహనాలు విక్రయించేవి. ఈ క్ర మంలో ఫైనాన్స్‌ నుంచి ఖరీదు చేసిన కన్సల్టెన్సీలు హనుమకొండకు చెందిన ఎం.డి. ఆసిఫ్‌, వడ్లకొండ శ్రీనివాస్‌.. ఆర్‌టీఏ బ్రోకర్లను సంప్రదించేవారు.

బోగస్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాల సృష్టి..

ఆర్‌టీఏ బ్రోకర్లుగా చలామణి అవుతున్న ఆసిఫ్‌, వ డ్లకొండ శ్రీనివాస్‌ ఫైనాన్స్‌ సంస్థలు స్వాధీనం చేసుకున్న వాహనాల ఆన్‌లైన్‌ పత్రాలను సేకరించి, ఆ తర్వాత వివిధ మార్గాల్లో బోగస్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించే వారు. ఇలా కన్సల్టెన్సీల వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిస్తూ వచ్చారు. అనంతరం వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌, రెన్యువల్‌ సర్టి ఫికెట్ల, వాహనాల బదిలీల కోసం బీమా లేని వా హనదారుల నుంచి ఈ ముఠా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి బోగస్‌ బీమా పత్రాలు తయారు చేసి ఆర్‌టీఏ కార్యాలయంలో సమర్పించే వారు.

నకిలీ రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌ పత్రాల తయారీ

15 మంది అరెస్ట్‌.. ఐదుగురు పరారీ

వివరాలు వెల్లడించిన డీసీపీ షేక్‌ సలీమా

బోగస్‌ పత్రాలు తయారీ ఇలా

ఈ ముఠా సభ్యులు ముందు ఒరిజినల్‌ బీమా పాలసీ పత్రం తీసుకుని అందులో తమకు కావాల్సిన వివరాలు పొందుపరిచే వారు. అలా ఆ పత్రాలను ఆర్‌టీఏ కార్యాలయంలో సమర్పించే వారు. కాగా, ఈ దందాలో ఆర్‌టీఏ కార్యాలయ సిబ్బంది సహకారంపై డీసీపీ అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల నుంచి ఆరు డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, రెండు లాప్‌టాప్‌లు, థర్మల్‌ ప్రింటర్లు, 17 సెల్‌ఫోన్లు, కంప్యూటర్‌ చిప్‌తో కూడిన పీవీసీ కార్డులు, కార్డు ప్రింటింగ్‌ సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ తెలిపారు. కాగా,నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన వరంగల్‌ ఏఎస్పీ శుభం ప్రకాశ్‌, హనుమకొండ, టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీలు నర్సింహరావు, మధుసూదన్‌, ఇన్‌స్పెక్టర్లు సత్యనారాయణరెడ్డి, శ్రీధర్‌, బాబులాల్‌, పవన్‌కుమార్‌, తదితరులను డీసీపీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement