కేయూ క్యాంపస్ : వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ జిల్లా స్థాయిలో ఈనెల 22, 23 తేదీల్లో కాకతీయ యూనివర్సిటీలో ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకు ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ అనే అంశంపై ప్రసంగ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులను రాష్ట్ర స్థాయి యూత్‌పార్లమెంట్‌కు ఎంపిక చేసినట్లు కేయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఈసం నారాయణ సోమవారం తెలిపారు. ఈ పోటీల్లో హనుమకొండ, ములుగు, ఏటూరునాగారం, భూ పాలపల్లి జిల్లాల నుంచి వివిధ డిగ్రీ కళాశాలల ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొని తమకు ఇచ్చిన సమ యం ప్రకారం ప్రసంగించారు. ఇందులో పదిమందిని రాష్ట్రస్థాయి యూత్‌పార్లమెంట్ ఎంపిక చేశారు. అందులో బి.సంధ్య బైరెడ్డి, ఎం. శ్రావ్య, శ్రీజయాదవ్, కాలాజ్ఞ (కేయూ బయోటెక్నాలజీ ), మహ్మద్ హాసన్ (యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్ సైన్స్ కాలేజీ, హ నుమకొండ), ఎం. శ్రావ్య, కార్తీక్ (కేయూ కోఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీ), ఎ.వినీలా (ప్రభుత్వ పింగిళి మహిళా కాలేజీ హనుమకొండ), అలేఖ్య, సిద్దార్థ (వరంగల్ కిట్స్ కాలేజీ), రచన (ములుగు ప్రభుత్వడిగ్రీ కాలేజీ), శంకర్ (భూపాలపల్లి ప్ర భుత్వ డిగ్రీకాలేజీ) ఉన్నారు. వీరు రాష్ట్ర అసెంబ్లీలో జరగబోయే స్టేట్‌లెవ్ వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్‌లో పాల్గొనబోతున్నారు. ఈనెల 23న ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు మాక్ పార్లమెంట్ కూడా నిర్వహించుకున్నారు. ఈ యూత్‌పార్లమెంట్ పోటీల సమావేశంలో కేయూ రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ప్రిన్సిపాల్ టి. మనోహర్, నెహ్రూ యువకేంద్రం జి ల్లా డిప్యూటీ ఆఫీసర్ అన్వేశ్, ఈ ప్రోగ్రాం కన్వీనర్ రాధిక, జ్యూరీ మెంబర్, కేయూ జూవాలజీ విభా గం ఆచార్యుడు మామిడాల ఇస్తారి పాల్గొన్నారు.