వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగే పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షల సమయంలో 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే పదో తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. సెంటర్లకు 5 కిలోమీటర్ల దూరం వరకు ఇద్దరికి మించి గుంపులు గుంపులుగా ఉండరాదని, ఎలాంటి సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలు, ఉరేగింపులు, ప్రచారాలు నిర్వహించరాదని, డీజేలు వినియోగించవద్దని వివరించారు. కేంద్రాల సమీపంలో పరీక్ష సమయంలో ఇంటర్నెట్, జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పెట్రోలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు.
పూర్తిస్థాయిలో కల్యాణ
మండపం నిర్మించాలి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో కల్యాణ మండప పనులు పూర్తి స్థాయిలో జరగాలని రాష్ట్ర హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి, బీసీ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ జస్టిస్ చంద్రయ్య అన్నారు. బుధవారం ఉదయం జస్టిస్ చంద్రయ్య, రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ నారాయణ వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, అర్చకులు వారిని ఘనంగా స్వాగతించారు. వారు స్వామివారిని దర్శించి బిల్వార్చన చేశారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహదాశీర్వచనం అందజేశారు. జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. కేంద్ర పురావస్తుశాఖ ఆఽధీనంలో ఉన్న ఈ ఆలయంలో భక్తులకు వేసవిలో తగిన సౌకర్యాలు కల్పించాలని, ఆలయ విశిష్టతను తెలిపేందుకు పూర్తి స్థాయిలో గైడ్‌ను నియమించాలన్నారు. వారి వెంట జిల్లా కోర్టు సిబ్బంది ఉన్నారు.
ముగిసిన ఇంటర్
ఫస్టియర్ పరీక్షలు
విద్యారణ్యపురి: ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు బుధవారం ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన పరీక్షల్లో హనుమకొండ జిల్లాలో 55 కేంద్రాల్లో జనరల్, ఒకేషనల్ కోర్సులు కలిపి 20,568 మందికిగాను 19,873మంది విద్యార్థులు హాజరయ్యారు. 695మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ ఎ.గోపాల్ తెలిపారు.
డీటీఎఫ్ వరంగల్ జిల్లా
నూతన కమిటీ
వరంగల్: డీటీఎఫ్ వరంగల్ జిల్లా నూతన కమిటీని వరంగల్‌లో మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కె.యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎ.గోవిందరావు, ఉపాధ్యక్షులుగా డి.మహేందర్‌రెడ్డి, ఎస్.సుధారా ణి, డి.రవీందర్, కార్యదర్శులుగా ఎం.రామస్వామి, టి.సూరయ్య, టి.ఆనందాచారి, కె.నర్సింహులు ఎన్నికయ్యారు. అదేవిధంగా రాష్ట్ర కౌన్సిలర్లుగా బి.జాన్‌నాయక్, టి.అరుణ, ఆర్. రాంరెడ్డి, కె.కొమ్మయ్య, వి.సదానందం, ఆడిట్ కమిటీ కన్వీనర్‌గా కె.రమేశ్, సభ్యులుగా డి. శ్రీనివాస్, టి.యాకయ్యలను ఎన్నుకున్నారు.
పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు : సీపీ