కూటమి సర్కార్‌వి కక్షపూరిత రాజకీయాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి సర్కార్‌వి కక్షపూరిత రాజకీయాలు

Aug 31 2026 1:50 AM | Updated on Aug 31 2026 1:50 AM

వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ అరెస్టులు వేధింపులతో ప్రజా గొంతుకను నొక్కలేరు ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి ఎన్ని కేసులైనా ధైర్యంగా ఎదుర్కొంటాం వైఎస్సార్‌ సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా

నెహ్రూనగర్‌: రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకుల గొంతు నొక్కేందుకు అక్రమ అరెస్టు చేస్తోందని గుంటూరు తూర్పు మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్‌ ముస్తఫా, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. అక్రమ కేసులో నెల్లూరు సెంట్రల్‌ జైలులో 24 రోజులపాటు రిమాండ్‌లో ఉండి బెయిల్‌పై విడుదలైన మాజీ ఎమ్మెల్యే ముస్తఫాకు గుంటూరు నగరంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. గుంటూరు మిర్చి యార్డు వద్దకు చేరుకున్న ఆయన చుట్టుగుంట, హిందూ కాలేజీ సిగ్నల్స్‌, పాత బస్టాండు మీదుగా ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని వైఎస్సార్‌సీపీ నగర పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం నగర పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్కరిని కూడా అకారణంగా జైళ్లకు పంపలేదని ముస్తఫా గుర్తుచేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో కక్షతో అందర్నీ అన్యాయంగా జైళ్లకు తరలిస్తుండటం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకులకు ఆ భగవంతుడే తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజలకు ఎన్నడూ అన్యాయం చేయలేదని, ఏ పార్టీ వారికి కూడా ఎలాంటి హాని తలపెట్టలేదని స్పష్టం చేశారు. కక్షతో అక్రమంగా జైలుకు పంపారని ఆరోపించారు. ఇకనైనా కూటమి నేతలు తమ వైఖరి మార్చుకోవాలన్నారు. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ప్రజల కోసం నిలబడతాం

పార్టీ నగర అధ్యక్షురాలు షేక్‌ నూరి ఫాతిమా మాట్లాడుతూ ముస్తఫా వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనే ఏకై క కారణంతోనే ఇలా వేధించారని మండిపడ్డారు. వ్యాపారాల్లో సాధారణంగా జరిగే లావాదేవీలను సైతం పెద్దవిగా చిత్రీకరించి ఇలా జైలుకు పంపించడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల కోసం నిలబడే వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసే కుట్రలో భాగంగానే ఇలా వ్యవహరిస్తున్నట్లు మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎలాంటి వేధింపులకు గురిచేసినా ప్రజా గొంతుకగా నిలబడటాన్ని ఆపలేరని ఆమె స్పష్టం చేశారు. తమ అధినేత వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అండగా ఉంటామన్నారు. అనంతరం మంగళదాస్‌ నగర్‌లోని ముస్తఫా ఇంటి వద్దకు నూజివీడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్‌ అప్పారావు వచ్చి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్‌, పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర బాబు, చదలవాడ వేణు, చిలకా రమేష్‌, చింక శీను, పల్లా శీను, పూనూరి నాగేశ్వరావు, తుమ్మేటి శీను, తూర్పు, పశ్చిమ నియోజకవర్గం మాజీ కార్పొరేటర్లు పోలవరపు జ్యోతి వెంకటేశ్వర్లు, మహమూద్‌, షేక్‌ ఆబిద్‌, ధూపాటి వంశీ, పాపతోటి అంబేడ్కర్‌, రమణ బోయిన అజయ్‌, షేక్‌ ఫర్జానా, జిల్లా ట్రేడ్‌ యూనియన్‌ అధ్యక్షుడు శేషగిరి పవన్‌ కుమార్‌, జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షులు సైదా ఖాన్‌, నగర ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఆలా కిరణ్‌, యువజన విభాగం జనరల్‌ సెక్రటరీ ఉమర్‌ ఫరూక్‌, నగర యువజన విభాగం సెక్రటరీ ధూపాటి అనిల్‌, డివిజన్‌ అధ్యక్షులు సలీం, జాఫర్‌, రామయ్య, జబీరా, పుల్లా కిషోర్‌, గణేష్‌, సత్యం, ఇషాక్‌, నజీర్‌, రాజేష్‌, తుమ్మెటి కృష్ణ, కోటా రామదాసు, వేణు, పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement