తాడికొండలో ఎండిపోయిన వరి పైరు
వర్షాకాలం సీజన్ ప్రారంభమైనా చినుకు జాడ లేకపోవడంతో అన్నదాతలు ఆశలు ఆవిరవుతున్నాయి. తాడికొండ ఆయకట్టు ప్రాంతంలో వరి ఈ ఏడాది 700 ఎకరాల్లో సాగవుతోంది. రైతులు వెద పద్ధతిలో సాగు చేశారు. రెండు నెలలుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం పైరు ఎండిపోతోంది. దీంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పెట్టుబడులు పెట్టి సాగుకు సన్నద్ధమైతే ఎల్‌నినో ప్రభావం తమ కొంప ముంచిందని వాపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు. – తాడికొండ


