నెహ్రూనగర్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ–2026లో భాగంగా ఓటరు దరఖాస్తుల డిజిటలైజేషన్‌న్‌లో నిర్దేశించిన లక్ష్యాలు సాధించడంలో విఫలమైన 7 మంది బీఎల్‌ఓలకు గుంటూరు తూర్పు నియోజకవర్గ ఈఆర్‌ఓ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అరుణ బేజ్జం(25 పోలింగ్ బూత్), నాళి వెంకటేశ్వర్లు, వరప్రసాద్ దాసరి, షేక్ నజీరుద్దీన్ బాషా, బి.వెంకటేశ్వర్లు, కురగంటి కిరణ్, తెనాలి రత్నకుమార్‌లకు నోటీసులు జారీ చేశామన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాలను ప్రతి అధికారి తప్పనిసరిగా పూర్తి చేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. సంబంధిత బీఎల్‌ఓలు 24 గంటల్లోగా తమ వివరణ సమర్పించాలని, లేనిపక్షంలో ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం తదుపరి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. .
చిలకలూరిపేటటౌన్: టిడ్కో గృహాల్లో యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు... పట్టణంలోని 52 ఎకరాల టిడ్కో గృహ సముదాయంలో నివాసం ఉంటున్న సీహెచ్ ఉదయ్‌సాయి(27) ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌న్‌కు లుంగీతో ఉరివేసుకుని ప్రాణాలు విడిచాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు వీరయ్య, వెంకటరమణలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


