గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Jun 27 2026 1:31 AM | Updated on Jun 27 2026 1:31 AM

చిన్న వయసులో వెన్నెముక సమస్యలు వస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎక్కువ బరువు స్కూల్‌ బ్యాగులతో పిల్లల్లో వెన్నునొప్పి ఇబ్బందులు గుంటూరు మెడికల్‌: గుంటూరు లాలాపేటకు చెందిన సాకేత్‌ ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల తరచుగా వెన్నునొప్పి అని చెప్పి స్కూల్‌కు వెళ్లడం లేదు. తల్లిదండ్రులు ఇరువురు ఉద్యోగులు కావడంతో ఇంటి వద్దే ఆడుకోవటానికి ఇలా చెబుతున్నట్లు భావించారు. రోజూ సమస్య గురించి చెప్పేసరికి ఇటీవల వైద్యులను సంప్రదించారు. పరీక్షలు అనంతరం వెన్నెముకకు కొద్దిపాటి ఇబ్బంది ఏర్పడటం వలన నీ నొప్పి వస్తున్నట్లు నిర్ధారించి చికిత్స చేశారు. స్కూల్‌లో, ఇంట్లో ఏసీ గదుల్లోనే ఎక్కువ సమయం గడుపుతూ శరీరానికి సరిపడా ఎండ తగలక ‘విటమిన్‌ డి’ లోపం వల్ల సమస్య వస్తున్నట్లు వైద్యులు నిర్ధారించారు. సాకేత్‌ తన శరీర బరువు కంటే అధికంగా స్కూల్‌ బ్యాగ్‌ మోస్తూ ఉండటం వల్ల చిన్న వయస్సులోనే ఎక్కువ భారం వెన్నెముకపై పడటం వల్ల కూడా సమస్య తలెత్తినట్లు వైద్యులు పేర్కొన్నారు. చిన్ననాటి నుంచే... నర్సరీ, ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారుల కోసం డ్రాయింగ్‌ బుక్స్‌, హోంవర్క్‌ పుస్తకాలు, ఇతర పాఠ్యపుస్తకాలు అంటూ బోలెడు ఇస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లలకు 20 నుంచి 30 వరకు పుస్తకాలు అంటగడుతున్నారు. ఫలితంగా చిన్నవయస్సులోనే ఎక్కువ పుస్తకాల బరువులు మోస్తూ పిల్లలు వెన్నెముక సమస్యల బారిన పడుతున్నారు. లేత వయస్సులోనే అధిక భారం మోపటం వల్ల భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీటికి తోడు ఎక్కువ సేపు ఒకే భంగిమలో స్కూల్స్‌లో, ట్యూషన్‌ సెంటర్స్‌లో కూర్చోవటం వల్ల నడుంనొప్పి వస్తుంది. కొంత మంది పిల్లల్లో పుట్టుకతోనే ఎముకలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవటం వల్ల స్పయిన్‌ ఫ్యూజన్‌ వంటి ఇబ్బంది తలెత్తవచ్చని వైద్యులు చెబుతున్నారు. స్కోలియోసిస్‌ వచ్చిన వారిలో వెన్నెముక సీ లేదా ఎస్‌ ఆకారంలో ఒకవైపు వంగి ఉంటుంది. ఫలితంగా భుజాలు లేదా నడుం భాగం అసమానంగా ఉంటుంది. కై ఫోసిస్‌ వల్ల పిల్లలు ముందుకు గుండ్రంగా వంగి కూర్చునట్లు కనిపిస్తారు.

న్యూస్‌రీల్‌

జాగ్రత్తలు తీసుకోవాలి

25 కిలోల బరువున్న పిల్లవాడు గరిష్ఠంగా 2.5 కిలోల వరకు మాత్రమే బ్యాగ్‌ మోయడం మంచిది. అంతకంటే ఎక్కువ రోజూ మోస్తే వెన్ను, మెడ, భుజాల నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండు పట్టీలను సమానంగా బిగించి బ్యాగ్‌ను వీపునకు దగ్గరగా ఉంచాలి. ఒకే భుజంపై బ్యాగ్‌ వేసుకోవడం మంచిది కాదు. బరువైన పుస్తకాలను బ్యాగ్‌లో వీపునకు దగ్గరగా అమర్చాలి. అవసరం లేని పుస్తకాలు, వస్తువులు రోజూ బ్యాగ్‌లో పెట్టకూడదు. పాఠశాలల్లో లాకర్‌ లేదా తరగతి గదిలో పుస్తకాలు ఉంచేందుకు ప్రయత్నించాలి. పిల్లలు రోజూ కనీసం గంటసేపు ఆరుబయట ఆటలు, శారీరక వ్యాయామం చేయాలి. ఇది వెన్నెముక కండరాలను బలంగా ఉంచుతుంది. ఎక్కువసేపు మొబైల్‌ ఫోన్‌ లేదా ట్యాబ్‌ను వంగి చూడకుండా జాగ్రత్త పడాలి. పిల్లలు తరచుగా వెన్ను, మెడ, భుజాల నొప్పి వంటి వాటి గురించి చెబితే నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

వెన్నునొప్పి లక్షణాలు ఇవే....

సాగర్‌ నీటిమట్టం

చిన్నారులు వెన్నునొప్పితో బాధపడే సమయంలో నడకలో తేడా కనిపిస్తుంది. నిలబడటంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. త్వరగా అలసిపోతారు. నడుం లేదా మెడనొప్పి అని చెబుతుంటారు. వెన్నెముక భాగం స్పష్టంగా వంకరగా కనిపిస్తుంది. వెనుక భాగంలో అసౌకర్యంగా ఉంటుంది. కొద్దిపాటి లేదా విపరీతమైన నొప్పి వెన్ను భాగంలో వస్తుంది. రాత్రివేళల్లో నొప్పి వల్ల పిల్లలు సరిగా నిద్రపోరు. జ్వరంగా ఉంటుంది. ఆటలు ఆడేందుకు సైతం ఇబ్బంది పడతారు.

శనివారం శ్రీ 27 శ్రీ జూన్‌ శ్రీ 2026

ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన బాల్యం ప్రస్తుత పోటీ ప్రపంచంలో పుస్తకాల మోతతో భారంగా మారుతోంది. ఇప్పటికే ఆటలకు దూరమైన చిన్నారులు పాఠశాల గదుల్లోనే ఎక్కువగా మగ్గిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రైవేటు స్కూళ్లపై మోజు పెరిగిపోయింది. దీంతో బుడిబుడి అడుగులు వేసే బుడతలకు బండెడు పుస్తకాలు వీపున వేస్తున్నారు. ఇదే వారి వెన్నెముకకు భవిష్యత్తులో పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

– డాక్టర్‌ జె. నరేష్‌బాబు,

సీనియర్‌ స్పయిన్‌ సర్జన్‌, గుంటూరు

విజయపురి సౌత్‌: నాగార్జున సాగర్‌ జలాశయ నీటిమట్టం శుక్రవారం 515.30 అడుగులకు చేరింది. ఇది 140.4451 టీఎంసీలకు సమానం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement