మాదకద్రవ్యాల రవాణాకు వ్యతిరేకంగా ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్యాల రవాణాకు వ్యతిరేకంగా ర్యాలీ

Jun 26 2026 4:11 AM | Updated on Jun 26 2026 4:11 AM

గుంటూరు లీగల్‌: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యాన మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా గురువారం వన్‌ కె వాక్‌ నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ ప్రారంభించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయం నుంచి ప్రారంభమైన వాక్‌ మెడికల్‌ కాలేజీ రోడ్‌, పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌ మీదుగా జిల్లా కోర్ట్‌ ఆవరణ వరకు సాగింది. తదనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియాఉద్దీన్‌ మాట్లాడుతూ డ్రగ్స్‌ రహిత భారత్‌గా మార్చడానికి అవగాహన కలిగించాలన్నారు. డిస్ట్రిక్ట్‌ ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ ఆఫీసర్‌ వి.అరుణ కుమారి మాట్లాడుతూ ఎవరికై నా డ్రగ్స్‌ సమాచారం తెలిస్తే 14405కు కాల్‌ చేయాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ప్యానెల్‌ అడ్వకేట్‌ కె.కాళిదాసు లీగల్‌ ఎయిడ్‌ డిఫనన్స్‌ కౌన్సెల్‌ చీఫ్‌ సురేష్‌, డెప్యూటీ లీగల్‌ ఎయిడ్‌ డిఫన్స్‌ కౌన్సెల్‌ మధుబాబులు.. డ్రగ్స్‌ నివారణకు తీసుకోవాల్సిన పలు చర్యలను వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement