క్రాంతికుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే | - | Sakshi
Sakshi News home page

క్రాంతికుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

క్రాంతికుమార్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

తాడేపల్లి రూరల్‌: గత నెల 21వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న పేరుపోగు క్రాంతికుమార్‌ది ప్రభుత్వ హత్యే అని వైఎస్సార్‌ సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్టీఆర్‌ జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకులు ముదిగొండ ప్రకాష్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజకీయ కక్ష సా ధింపులకు, పోలీసులను వాడుకున్న చంద్రబాబు ప్రభుత్వం తీరువల్లే క్రాంతికుమార్‌ కుటుంబం రోడ్డున పడిందన్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు పలుమార్లు క్రాంతికుమార్‌పై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించి, అతని మరణానికి కారణమయ్యారని పేర్కొన్నారు. టాక్సీ నడుపుకొంటూ కు టుంబాన్ని పోషించుకుంటున్న క్రాంతికుమార్‌ను ఇన్‌ఫార్మర్‌గా మారాలని సీఐ వేధించారని, లేకుంటే గంజాయి కేసు పెడతానని హెచ్చరించినట్లు తెలిపారు. క్రాంతికుమార్‌ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, కేసును సీబీఐకి అప్పజెప్పాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు వెంటనే సీఐ నాగరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాకుండా క్రాంతికుమార్‌ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement