నిబంధనలకు విరుద్ధంగా పీజీ పరీక్షల షెడ్యూల్‌ | - | Sakshi
Sakshi News home page

నిబంధనలకు విరుద్ధంగా పీజీ పరీక్షల షెడ్యూల్‌

Jun 25 2026 7:22 AM | Updated on Jun 25 2026 7:22 AM

వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం నేతలు

ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో జూలై 7వ తేదీ నుంచి పీజీ సెకండ్‌ సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ ప్రకటన నిబంధనలకు విరుద్ధంగా ఉందని వైఎస్సార్‌ సీపీ విద్యార్థి విభాగం ఏఎన్‌యూ శాఖ అధ్యక్షుడు పంతగాని రమేష్‌ ఆరోపించారు. ఏఎన్‌యూలో బుధవారం రమేష్‌ మాట్లాడుతూ సెమిస్టర్‌ మధ్య దూరం కనీసం 90 నుంచి 100 రోజులు ఉండాలని, అధికారులు 63 రోజుల వ్యవధిలోనే నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఇవ్వడం దారుణంగా ఉందన్నారు. సిలబస్‌ పూర్తి కాకుండానే తరగతులు నిర్వహిండానే పరీక్షల షెడ్యూల్‌ ఇవ్వడం వలన విద్యార్థిలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇవ్వడం, చేతిరాతతో ప్రశ్నపత్రం తయారు చేయడం, రెండు సంవత్సరాలుగా పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పీజీ పరీక్షల అధికారుల నిర్ణయాలు ప్రకారం నోటీపేకేషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వడం విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడమేనన్నారు. అనంతరం వర్సిటీ తాత్కాలిక రిజిస్ట్రార్‌ ఆచార్య జి.సింహాచలంకు వినతి పత్రం అందజేశారు. నోటీఫికేషన్‌ వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళనకు సిద్ధమని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నాయకులు కొమ్మ ప్రవీణ్‌, కె.జ్యోతి, సురేష్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement