అఖిల భారత కిసాన్ సభ నాయకులు
లక్ష్మీపురం: రైతులు, కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న విజయవాడ ధర్నా చౌక్‌లో నిర్వహించే ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) నాయకులు పిలుపునిచ్చారు. గురువారం గుంటూరు కొత్తపేటలోని ఏఐకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి.వి.జగన్నాథం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని వారు విమర్శించారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కవులు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంజుల విఠల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


